For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  PSPK 29: మరో మాస్ దర్శకుడితో పవన్ సినిమా.. యథా కాలమ్.. తథా వ్యవహారమ్!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ వసంతంలోకి అడుగు పెట్టడంతో అభిమానులు ఈ పుట్టినరోజును ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీలు కూడా పవర్ స్టార్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తుండడంతో సోషల్ మీడియాలో ప్రత్యేకమైన సందడి నెలకొంది. వరుసగా నాలుగు సినిమాలు లైన్ పెట్టిన పవర్ స్టార్ అభిమానులకు ఒక మంచి కిక్కు ఇస్తున్నాడనే చెప్పాలి.

  ఇక ఫైనల్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు. అసలు వీరి కలయికలో సినిమా ఉంటుందా లేదా అని ఓ వర్గం ప్రేక్షకుల్లో సందేహం నెలకొన్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సురేంధర్ రెడ్డితో కూడా సినిమా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది.

  RX 100 Karthikeya కాబోయే భార్య ఎంత అందంగా ఉందొ చూశారా? హీరోయిన్స్ చాలరు!

  చివరగా సైరా సినిమాతో..

  చివరగా సైరా సినిమాతో..

  కిక్ ఊసరవెల్లి రేసుగుర్రం దృవ వంటి ఎన్నో బాక్సాఫీస్ యాక్షన్ సినిమాలు తీసిన సురేందర్ రెడ్డి చివరగా సైరా సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేక పోయింది. కానీ మెగాస్టార్ సైరా సినిమాలో నటించిన విధానం ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

  మెగా అభిమాని పెళ్లికి అల్లు అర్జున్.. వివాహ వేడుకలో సాయిధరమ్ తేజ్, ఇంకా సినీ ప్రముఖులు ఎవరంటే!

  వచ్చే ఏడాది సెట్స్ పైకి..

  వచ్చే ఏడాది సెట్స్ పైకి..

  ఇక మొదటిసారి సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నాడు. తన కెరీర్ మొదటి నుంచి కూడా సురేందర్ రెడ్డి ఎలాగైనా పవర్ స్టార్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇదివరకే రెండు సార్లు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకో అప్పుడు వర్కౌట్ కాలేదట. ఇక ఫైనల్ గా వచ్చే ఏడాది సురేంధర్ రెడ్డి తాను అనుకున్న హీరోతో సినిమా చేయబోతున్నాడు.

  Izabelle Leite: 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే.. హాట్ బికినీ ఫొటోస్

  యథా కాలమ్.. తథా వ్యవహారమ్..

  యథా కాలమ్.. తథా వ్యవహారమ్..

  ఇక మొదటిసారి సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు సంబంధించిన ఒక లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్.. అనే లైన్స్ తో పోస్టర్ ను వదిలారు. కాలానికి తగ్గట్లుగానే పరిస్థితులు నెలకొన్నాయి అని హైదరాబాద్ సిటీని అలాగే గన్నును కూడా పోస్టర్ లో హైలెట్ చేశారు. వక్కంతం వంశీ సినిమాకి కథ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను SRT ఎంటర్టైన్మెంట్స్ లో రామ్ తళ్లూరి నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.

  సినిమా వచ్చేది ఎప్పుడంటే

  సినిమా వచ్చేది ఎప్పుడంటే

  పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొత్తానికి సినిమాపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. .ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎడాది సమ్మర్ అనంతరం తన చేతిలో ఉన్న మూడు సినిమాలను ఫినిష్ చేసి ఫ్రీగా ఉంటాడు కాబట్టి అప్పుడు సురేందర్రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Pawan Kalyan Director Surender Reddy For PSPK 29 first announcement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X