twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోన వెంకట్ క్షేమం గురించి పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ రచయత కోన వెంకట్ క్షేమం గురించి పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేసారు. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా తన సోషల్ నెట్ వర్కింగ్ పేజీ ద్వారా తెలియచేసారు. ప్రముఖ రచయిత కోనవెంకట్, నిర్మాత డి.వి.వి.దానయ్య దారి దోపిడికి గురయ్యిన సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ జన్మదిన వేడుకలు గురువారం రాత్రి షాద్ నగర్‌ పరిధి కమ్మదనంలోని ప్రకాష్ రాజ్ ఫాంహౌజ్‌లో ఏర్పాటు చేసినప్పుడు ఇది చోటు చేసుకుంది.

    కోన వెంకట్ రాస్తూ... ' నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ మరియు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు అడిగారు. వారందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. అంతేకాకుండా నేను ప్రత్యేకంగా మహబూబ్ నగర్ పోలీస్ డిపార్టమెంట్ కు కూడాకృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను' అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Pawan Kalyan Enquires about Kona's Safety

    సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...

    సెలబ్రేషన్స్‌కు రచయిత కోనవెంకట్, నిర్మాత దానయ్య, దర్శకుడు శ్రీనువైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాజరయ్యారు. పుట్టిన రోజు వేడుకలు ముగించుకుని తిరిగి ప్రయాణమైన సమయంలో నూర్ కాలేజీ వద్ద కల్వర్టు దగ్గరకు రాగానే రోడ్డుకు అడ్డంగా చెట్టు ఉండటంతో కారు ఆపారు. ఇంతలో ఇద్దరు గొడ్డళ్లతో వచ్చి కారు అద్దాలు పగలగొట్టారు.

    డ్రైవర్ పై దాడి చేసారు. కోన వెంకట్, దానయ్యలను బెదిరించి వారి మెడలోని బంగారు గొలుసులు, చేతికున్న ఉంగరాలు, డ్రైవర్ దగ్గరున్న రూ. 1500 దోచుకెళ్లారు. వీరి వెనకనే మరో కారులో వస్తున్న తమన్, శ్రీను వైట్ల ఈ దాడి సంఘటన గమనించి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    English summary
    Sharing the news Kona wrote on his social networking page, 'I thank each & everyone who called me and inquired about my safety, especially my dear friend Pawankalyan, Ex chief minister Kiran Kumar Reddy, Lagadapati Rajgopal garu and many celebrities from film industry and politics. I also would like to thank Mahboobnagar Police dept. who are putting their best efforts to catch the criminals. I hope they do it soon before they strike again.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X