»   » వెరైటీగా పవన్‌ అభిమానుల గణేష్ మండపం!(ఫోటో)

వెరైటీగా పవన్‌ అభిమానుల గణేష్ మండపం!(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమదైన రీతిలో విఘేశ్వరుడిని ప్రతిష్టించారు. ఓ వైపు గణపతి బప్పాపై భక్తిని చాటుకుంటూనే...మరో వైపు పవన్ కళ్యాన్‌పై అభిమానాన్ని కూడా చాటు కుంటూ వెరైటీగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసారు.

ఫేస్ బుక్ పేజీని తలపించేలా గణేష్ మండపాన్ని డిజైన్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు అభిమానుల ఫోటోలు కూడా చేర్చారు. ఈ మండపం ఇప్పుడు చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ మండపాన్ని చూసిన కొందరు భక్తి దేవుడిపైనా? పవన్ కళ్యాణ్ పైనా? అని ప్రశ్నిస్తున్నారు. 'చిత్తం గణేషుడిపై....భక్తి పవన్ కళ్యాణ్‌పై' అంటే ఇదేనేమో!

ఇంతే కాకుండా మరో చోట పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంలోని పాత్రను తలపించేలా పోలీస్ డ్రెస్సులో తలకు రుమాల్ కట్టుకుని ఉన్న గణేష్ ప్రతిమను కూడా ఏర్పాటు చేసారు కొందరు అభిమానులు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఈ చర్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.

ఇలాంటి పరిణామాలకు కారణం పవన్ కళ్యాణ్‌పై ఆయన అభిమానులకు ఉన్న వీరాభిమానమే అని స్పష్టం అవుతోంది. పవన్ కళ్యాణ్ కేవలం సినిమా హీరోగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా, సేవా భావం ఉన్న మానవతా వాదిగా ముందుకు సాగుతుండటంతో ఆయనకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.

English summary
Ganesh mandap Formed Like Facebook page by Pawan Kalyan fans. Another place Lord Ganesha has taken new look as Pawan Kalyan's Gabbar Singh movie inspired devotees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu