twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరిహర వీరమల్లు సినిమాలో హైలెట్ అయ్యే అంశం అదే.. అందుకోసమే భారీ బడ్జెట్!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకులు ఎక్కువగా హరిహర వీరమల్లు సినిమాపైనే ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలను చేసింది లేదు. విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే క్రిష్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరపైకి తీసుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ మీడియాకు తెలియజేశారు.. సినిమాలో కొన్ని అంశాలు మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి అని అన్నారు.

    చారిత్రాత్మక అంశంతో

    చారిత్రాత్మక అంశంతో

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎక్కువగా ప్రేమ కథలు యాక్షన్ సన్నివేశాలు వంటి కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేశారు. ఇక మొదటి సారిగా ఆయన చారిత్రాత్మక నేపథ్యంలో ఒక పిరియాడిక్ సినిమాను చేయబోతున్నారు. చారిత్రాత్మక అంశంతో హరిహర వీరమల్ల సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట

    భారీ బడ్జెట్..

    భారీ బడ్జెట్..

    హరిహర వీరమల్లు సినిమాల్లో ఎక్కువగా చారిత్రాత్మక నేపథ్యంలో కొన్ని ఐకానిక్ కట్టడాలను కూడా చూపించబోతున్న ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గండికోట అలాగే చార్మినార్ వంటి ఆర్ట్ వర్క్ ఎంతగానో ఆకట్టుకుంటాయి అని తెలుస్తోంది. వీటిని నిర్మించిన కాలంలోనే సినిమా కథ ఎక్కువగా కొనసాగుతుందట. సినిమాలో ప్రతి అంశం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 160కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

     పవర్ఫుల్ పాత్రలో పవన్

    పవర్ఫుల్ పాత్రలో పవన్

    ఇంతవరకు దర్శకుడు క్రిష్ సినిమా కు సంబంధించిన కథపై ఒక్క వివరణ కూడా ఇవ్వలేదు. 16 శతాబ్దం మధ్యకాలంలో రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని కూడా టాక్ అయితే వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దొంగతనాలు చేస్తూ లేనివారికి దానం చేస్తూ ఉంటాడు అని కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి.. పవర్ ఫుల్ వారియర్ గానే కాకుండా ఒక గజ దొంగగా కూడా మహారాజులను ముప్పు తిప్పలు పెట్టే పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.

    ఆర్ట్ వర్క్.. హైలెట్ అయ్యేలా

    ఆర్ట్ వర్క్.. హైలెట్ అయ్యేలా

    ఇక ఈ సినిమా సెట్ వర్క్ గురించి హరిహర వీర మల్లు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మరో వివరణ ఇచ్చారు.

    హరి హర వీర మల్లు సినిమాలో కళాత్మకమైన సెట్ వర్క్స్‌పై అద్భుతంగా ఉంటుందని అంటూ... అందమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సెట్‌ వర్క్స్‌లోనే సౌందర్యాన్ని జోడిస్తున్నట్లు చెప్పారు. అందులోనే అనేక రకాల అంశాలు హైలెట్ అవుతాయట. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా కూడా ఆనంద్ వువరణ ఇచ్చారు. ఆర్ట్ వర్క్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నాట్లు తెలుస్తోంది.

    Recommended Video

    10th Class Diaries Teaser Launch | Cinematographer Chota K Naidu Speech | Filmibeat Telugu
    రిలీజ్ ఎప్పుడంటే?

    రిలీజ్ ఎప్పుడంటే?

    ఇక హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా బాలీవుడ్ లో కూడా భారీగానే విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఎమ్ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ అనంతరం దసరా సమయంలో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి వారి ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

    English summary
    Pawan kalyan Harihara veeramallu movie main highlight points ,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X