»   » కోట్లు ఇస్తామంటున్నారు: ప్లాపైనా పవన్ రేంజి తగ్గలేదు

కోట్లు ఇస్తామంటున్నారు: ప్లాపైనా పవన్ రేంజి తగ్గలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ప్లాపులను జయించిన స్టార్ అంటుంటారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన సినిమా ప్లాపైనా, హిట్టయినా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్, టాప్ డైరెక్టర్లు, నిర్మాతల్లో ఆయనతో చేయాలనే కోరిక తగ్గక పోవడమే ఇందుకు కారణం.

  పవన్ కళ్యాణ్ గత సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించిన పవన్ కళ్యాణ్ సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణం అయ్యాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పలేదు.

  ఈ సినిమా రిజల్టు పట్టించుకోకుండా వెంటనే పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు. ఈచిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా తన స్నేహితుడు శరత్ మరార్ కే అప్పగించారు పవన్. ఈ సినిమా ద్వారా శరత్ నష్టాలతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పూడ్చాలనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ మంచి తనమే పవన్ కళ్యాణ్ ను ఇంత పెద్ద స్టార్ ను చేసిందేమో!

  Pawan Kalyan next movie remuneration Rs 25 crore

  పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో ఇది హయ్యెస్ట్ అమౌంట్. మరి పవర్ స్టారా మజాకా!

  గతంలో పవన్ కళ్యాణ్ కి 'ఖుషి' లాంటి భారీ హిట్ తో పాటు 'కొమురం పులి' లాంటి భారీ ప్లాపును అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని సూర్య భిన్నంగా చూపించబోతున్నారని, ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో మంచి లవ్ స్టోరీతో ఉంటుందని టాక్.

  English summary
  Pawan Kalyan is pocketing a huge remuneration for his upcoming film. He seems to be charging as much as Rs 25 crore per film right now. While his close buddy Sarath Marar will co-produce the flick, nother friend SJ Suryah would wield the megaphone.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more