»   » పవన్ ..బోస్టన్ టూరు లేటెస్ట్ అప్ డేట్, పూర్ణకుంభ స్వాగతం

పవన్ ..బోస్టన్ టూరు లేటెస్ట్ అప్ డేట్, పూర్ణకుంభ స్వాగతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంగారెడ్డి లో తన తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ చేస్తూ బ్రేక్ ఇచ్చి పవన్ నిన్న బోస్టన్ బయలుదేరి ఈరోజు సాయంత్రం 6 : 45 (బోస్టన్ లో ఉదయం 7.40ని.లు) కు అక్కడకు చేరుకున్నారు. ఈ పర్యటన 9 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు జరగనుంది.

ఐదు రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళిన పవన్ తొమ్మిదో తేదీ ఉదయం 5గంటల నుండి 12వ తేది సాయంత్రం 6.30ని.ల వరకు పలు కార్యక్రమాలతో బిజీ కానున్నారు.

ముఖ్యంగా ఈ పర్యటనలో పవన్ న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యు బన్, ఎనర్జీ పాలసీ రూపకల్ప నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీ లీలతో పాటు హ్యాంప్ షైర్ గవర్నర్, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి పలువురు ముఖ్యులను కలుసుకుని చర్చలు జరుపుతారు.

పూర్ణ కుంభంతో

పూర్ణ కుంభంతో

ఇక చివరి రోజు 12న నషువా లోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహిస్తున్న కార్ ర్యాలీలోను పాల్గొంటారు. అనంతరం ఎన్ ఆర్ ఐలు ఏర్పాటు చేసిన డిన్నర్ రిసెప్షన్ సభాస్ధలికి చేరుకుంటారు. అక్కడ పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకనున్నారు.

బికమింగ్ జనసేనాని

బికమింగ్ జనసేనాని

అలాగే తెలుగు లలితా కళావైభవానికి చిహ్నమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే 11వ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీలో ‘బికమింగ్ జనసేనాని' అనే అంశంపై మాట్లాడి 12న నోట్ ప్రసంగం ఇవ్వనున్నారు పవన్.

గంటసేపు

గంటసేపు

ఇక ఈ టూర్ లో మరో స్పెషాలిటీ ఏమిటీ అంటే...సాధారణంగా.. ఉపన్యాసకులు ఎవరికైనా కేవలం అరగంట సేపు మాత్రమే ప్రసంగించే అవకాశముంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం నిర్వాహకులు సుమారు గంట సేపు ప్రసంగించే ఛాన్స్ ఇచ్చారు.

ఏం మాట్లాడబోతున్నారు

ఏం మాట్లాడబోతున్నారు

ఇండియా కాన్ఫరెన్స్‌ 2017 కార్యక్రమానికి మాధవన్ కూడా హాజరు కానున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా కూడా వక్తగా సదస్సులో పాల్గొననున్నారు. అయితే బోస్టన్ సదస్సు లో ఉన్న పవన్ ఏ అంశాలను ప్రస్తావించి మాట్లాడతారు ఆయన ప్రసంగం ఏ విధంగా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంగారెడ్డిలో

సంగారెడ్డిలో

పవన్‌కళ్యాణ్‌ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు' షూటింగ్‌ సంగారెడ్డి జిల్లాలో జరుగింది. అక్కడ ఇస్మాయిల్‌ఖాన్‌ పేటలోని సప్త ప్రాకారయుత దుర్గా భవానీ మాత ఆలయంలో చిత్ర యూనిట్‌ సందడి చేసింది. షూటింగ్‌లో భాగంగా జాతరకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించగా, ప్రధానతారాగణం అందులో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ దీంతో చిత్ర షూటింగ్‌ 70శాతం పూర్తైందని అన్నారు.

హిట్ చిత్రం

హిట్ చిత్రం

తమిళంలో హిట్‌ అయిన ‘వీరమ్‌' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఇందులో పవన్‌ సరసన శృతీహాసన్‌ నటిస్తోంది. శివ బాలాజీ, అజయ్‌, కమల్ కామరాజు, రావు రమేష్‌, తరుణ్‌ అరోరా తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అనూప్‌రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని ఉగాదికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు.

రికార్డ్ లు

రికార్డ్ లు

పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవుతున్నాయి.క‌బాలి టీజ‌ర్ 60 గంట‌ల్లోనే 5 మిలియ‌న్ల వ్యూస్ సాధించింది. లైక్స్ ప‌రంగా టీజ‌ర్ క‌బాలి రికార్డును సైతం క్రాస్ చేసేసింది.

పవర్ ఫుల్ డైలాగ్

ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో ‘రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
దీంతో అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.

కర్ణాటకలో

కర్ణాటకలో

కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడిందిని , ఎనిమిదిన్నర కోట్లకు అడుగుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఖైదీ కూడా అదే రేటుకు తీసుకుంటే తొమ్మిది కోట్ల పైచిలుకు వసూలు చేసింది. దాంతో కాటమరాయుడుని పోటీ పడి మరీ తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

తమ్ముడుకి ఫోన్ చేసి

తమ్ముడుకి ఫోన్ చేసి

ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు' టీజర్ రిలీజ్ అయి రికార్ట్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడంతో చిరంజీవి స్వయంగా తమ్ముడికి ఫోన్ చేసి అభినందించారని తెలుస్తోంది. దాంతో పవన్ చాలా ఆనందించారని తెలుస్తోంది.

పండగే కదా

పండగే కదా

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయ్యారనే వార్త కూడా వెలువడటంతో అభిమానులకు పండగ వాతావరణం వచ్చినట్లైంది.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ ,‘గబ్బర్‌సింగ్ తరువాత పవన్‌కళ్యాణ్, శృతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాటమరాయుడు. మరోసారి వీరి జంట కనువిందు చేయనుంది. ' అన్నారు.

దర్శకుడు డాలి మాట్లాడుతూ, పవన్‌తో రెండు సినిమాలు చేయడం ఆనందంగా వుంది. త్వరలో ఆడియోను విడుదల చేసి ఉగాదికి చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

 వీళ్లంతా కలిసే...

వీళ్లంతా కలిసే...

శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
After finishing the shoot of Pawan Kalyan’s upcoming movie, Katamarayudu at Sangareddy, Pawan reaches Boston to deliver speech at Harvard University. He was invited as chief guest ‘India Conference 2017‘ at Harvard University on Feb 11 and Feb 12.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu