twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆశ్చర్యం: పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివారట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఫాలోయింగ్ లక్షలు, కోట్లలో ఉంటుంది. ‘పవనిజం' పేరుతో ఆయన అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‍‌ను తాము ఫాలోకావడానికి కారణం ఆయన మంచి మనసు, సామాజిక స్పృహ, సేవా గుణమే అని అంటుంటారు అభిమానులు.

    ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీకాంత్ ఆయనపై పుస్తకం రాయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ జీవితంపై రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి అద్దంపట్టేలా ఉంటుందని అంటున్నారు.

    Pawan Kalyan read Nearly 2 lakh books

    పవన్ కళ్యాణ్ గురించి రీసెర్చిలో భాగంగా శ్రీకాంత్ పలు సార్లు.... పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావ్, తల్లి అంజనా దేవి, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబుతో సమావేశమై ఆయన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తండ్రి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల పుస్తకాల చదివినట్లు వెల్లడించారట. పవన్ కళ్యాణ్... రమణ మహర్షిని ఫాలో అవుతుంటారని వెల్లడించారట.

    పవన్ కళ్యాణ్ పై ఈ పుస్తకంగా త్వరలోనే విడుదల కాబోతోందని.... పవనిజం పేరుతోనే ఈ పుస్తకం విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ పుస్తకం అభిమానులకు ఇన్స్‌స్పిరేషన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ పుస్తకం విడుదలైతే హాట్ కేకుల్లా అమ్మడవటం ఖాయమని అంటున్నారు.

    English summary
    Die hard fan named Srikanth learnt from Pawan's father that the actor read as many as 2 lakhs books till date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X