»   » పవన్ కళ్యాణ్ చేతులు మీదగా అంతం విడుదల..!

పవన్ కళ్యాణ్ చేతులు మీదగా అంతం విడుదల..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల కాలంలో తను నటించినటువంటి పులి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో లవ్ ఆజ్ కల్ రీమెక్ లో ప్రస్తుతం నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈసినిమాకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సినిమాలో హిరోయిన్ గాత్రిష హీరోయిన్ గానటిస్తున్నారు. అంతం సినిమా ఆడియో ఫంక్షన్ కుహాజరైనటువంటి పవర్ స్టార్ మాట్లాడుతూ నేను నటించిన పులి చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను టినూవర్మ అద్భుతంగా చేసారు. ఆయనతో వున్న స్నేహంవల్ల ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని అన్నారు. ఎంతో ఎఫర్ట్ పెట్టి తీసిన ఈచిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అర్జున్, రజనీష్ దుగ్గల్, సయాలీ భగత్ అన్య, బియాంకా దేశాయ్ నాయికలుగా టినూవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అంతం. హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం లోగో, ఆడియో సిడిని ఆవిష్కరించిన అనంతరం ఆయన పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా టినూ వర్మ మాట్లాడుతూ' ఈ చిత్రం షూటింగ్ ని తలకోన అడవుల్లో జరిపాం. అడవి నేపధ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆరుగురు వ్యక్తులు వీకెండ్ గడపడానికి అడవికి వెళతారు. అక్కడ వారికి ఎదురైనా చేదు అనుభవాల సమాహారంతో ఈ చిత్రం సాగుతుంది' అన్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కపిషేక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమిత్, రాజ ప్రేమి, టినూ వర్మ తదితరులు నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu