»   » భార్యాపిల్లలతో పవన్ ఇటలీ ట్రిప్..వెనక అసలు కథ, భర్తగా నాలుగు మార్కులే వేసిన రేణు దేశాయ్

భార్యాపిల్లలతో పవన్ ఇటలీ ట్రిప్..వెనక అసలు కథ, భర్తగా నాలుగు మార్కులే వేసిన రేణు దేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం షూటింగ్ పూర్తి చేసి, విడుదల చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్.. హఠాత్తుగా ఇటలీ టూర్ ప్లాన్ చేశాడు. అదీ పెళ్లాం బిడ్డలతో కావటంతో కావటంతో అంతటా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇక్కడో తెలివైన నిర్ణయం ఉంది. పవన్ అటు పుణ్యం.ఇటు పురషార్దం అన్నట్లుగా...కాటమరాయుడు పాటల షూటింగ్ అక్కడే చేస్తారు. అలాగే ఫ్యామిలీ వెకేషన్ అక్కడే ఫినిష్ చేస్తారు. అయితే.. మార్చ్ 14 నాటికి మాత్రం పవన్ హైద్రాబాద్ వచ్చేస్తారు. ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన మూడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇక ఇటలీ టూర్ నిమిత్తం ఈ రోజు ఉదయం బయల్దేరి పవన్ వెళ్లనుండగా.. మరొక రోజులో శృతి హాసన్ కూడా యూనిట్ తో జత కానుంది. నిజానికి ఈ పాటలను ...మొదట స్విట్జర్లాండ్ తో ఈ పాటలు తీద్దామని పవన్ భావించాడు కానీ.. గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారేది.. సర్దార్ చిత్రాలకు అక్కడే షూటింగ్ చేశారు. అందుకే లొకేషన్ ను ఛేంజ్ చేశాడని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ...సడెన్ గా ఇటలీ టూర్ బయల్దేరుతుండే సరికి ఆశ్చర్యపోతున్నారు అంతా.

Pawan Kalyan's Italy Trip, Renu Desai comments

ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా.. ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది . ఈ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలకు స్వీడుగా ఆన్సర్ చేయగా.. వాటిలో ఎక్కువ శాతం పవన్ కి చెందినవే అయి ఉన్నవే కావడం విశేషం.

ఆ ఇంటర్వూలో భాగంగా.... తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం మిలాన్ అని చెప్పిన రేణూ దేశాయ్.. బాలు సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ ఎన్నో ప్రదేశాలను పవన్ కళ్యాణ్ తో కలిసి తిరిగినట్లు చెప్పింది.

అలాగే ..తాను ఎంతో త్వరగా నిర్ణయాలు తీసుకుంటానని.. తన జీవితంలో పెళ్లి చేసుకోవడం అతి తొందరపాటు నిర్ణయంగా చెప్పింది రేణూ దేశాయ్. ఒక భర్తగా అయితే పవన్ కు 4-5 మార్కులే వేస్తానని చెప్పిన ఈ మాజీ వైఫ్.. తండ్రిగా అయితే పదికి వంద మార్కులు వేస్తానంది. ఫిలిం యాక్టర్ గా పదికి పది.. పొలీటీషియన్ గానూ పదికి పది మార్కులు వేస్తానంది.

కొడుకు అకీరాతో పవన్ సినిమాల్లో ఏదో ఒకదాన్ని రీమేక్ చేయాల్సి వస్తే.. ఖుషీ మూవీని ఎంచుకుంటానని చెప్పింది రేణూ. అయితే.. పవన్ సినిమాల్లోంచి ఒకటి తను రీమేక్ చేస్తే మాత్రం జానీ మూవీని ఎంచుకుంటానని.. ఒరిజినల్ స్టోరీ వేరన్న ఆమె.. మేకింగ్ లో కమర్షియల్ వేల్యూస్ కోసం కథను చాలా మార్చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అదీ విషయం. ఇలా ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు.

English summary
Pawan Kalyan has decided to leave for Italy for a change. Pawan Kalyan's wife and his kids will accompany him to Italy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu