twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకా దక్కని గుర్తింపు: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ' స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ లక్ష్యం అధికారం కాదు...ప్రజల తరుపున ప్రభుత్వాలను ప్రశ్నించడమేనని పవన్ కళ్యాణ్ సభలు పెట్టి మరీ దంచి చెప్పడంతో పలువురు అభిమానులు ఆ పార్టీ వైపు ఆర్షితులయ్యారు.

    ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడంతో....ఆయన మాటపై గౌరవం, అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని సైలెంటుగా ఉన్నారు ఫ్యాన్స్. ఎన్నికలు ముగిసాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో 'జన సేన' పార్టీ గురించిన ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.

    Pawan Kalyan's Jana Sena Party in talk

    ఇప్పటికైనా 'జనసేన' పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో ప్రజల తరుపున ప్రభుత్వాలను ప్రశ్నించడానికి 'జన సేన' పార్టీ ఒక వేదికగా చేసుకోవాలని పలువురు ఫ్యాన్స్ ఉవ్విల్లూరుతున్నారు.

    కానీ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన విషయాలపై పెద్దగా దృష్టి పెట్టక పోవడంపై పలువురు ఫ్యాన్స్ నిరాశలో కూరుకు పోయారు. ఇప్పటి నుండే పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే 2019 నాటికి మంచి ఫలితాలు సాధించవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్....అవి పూర్తయిన వెంటనే పార్టీకి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.

    English summary
    
 Pawan Kalyan's Jana Sena Party in talk. Jana Sena or Jana Sena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by actor Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X