»   » పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నాడంటే ఆశ్చర్యమే మరి!

పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నాడంటే ఆశ్చర్యమే మరి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సినిమాకు మధ్య ఎంత గ్యాప్ తీసుకుంటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇపుడు మాత్రం ఆయన తీరు మారినట్లు కనిపిస్తోంది. అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ....వెంటనే నెక్ట్స్ మూవీకి సిద్దమవుతున్నారు.

2019 నాటికి పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాపులో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి అభిమాలను ఎంటర్టెన్ చేయడంతో పాటు తన రాజకీయ పార్టీని నడిపించడానికి కావాల్సినంత డబ్బును కూడబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలై కనీసం నెల రోజులు కూడా గడవక ముందు ఆయన తర్వాతి సినిమా మొదలు కాబోతోంది. ఆయన తర్వాతి సినిమా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పిల్లలతో గడిపేందుకు పూణె వెళ్లారు. వచ్చే వారం ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు.

తన తర్వాతి సినిమా ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ప్రస్తుతం దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

స్లైడ్ షోలో ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన విశేషాలు.

ఫ్యాక్షనిజం స్టోరీ

ఫ్యాక్షనిజం స్టోరీ


ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉంటుందని తెలిపారు.

లవ్ యాంగిల్ కూడా..

లవ్ యాంగిల్ కూడా..


కేవలం ఫ్యాక్షనిజం రిలేటెడ్ స్టోరీ మాత్రమే కాదు... లవ్ యాంగిల్ కూడా ఉంటుందట.

ఖుషి తర్వాత..

ఖుషి తర్వాత..


గతంలో పవన్, ఎస్.జె సూర్య కాంబినేషన్లో ఖుషి చిత్రం వచ్చింది. దీని తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

వీలైనంత త్వరగా..

వీలైనంత త్వరగా..


ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించి వీలైనంత త్వరగా... వీలైతే ఈ సంవత్సరమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Pawan Kalyan is currently in talks to begin his next from the end of this month, without much delay. S J Surya will be directing the project and Anup Rubens will be handling the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu