twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

    నాకు ఏ పని ఇచ్చినా సరే అది తోట పని కావచ్చు, వీధులు ఊడ్చే పని కావచ్చు. ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా, చాలా నిజాయితీగా పని చేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం కాట‌మ‌రాయుడు.శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆకట్టుకునే స్పీచ్ ఇచ్చారు. సినిమాల్లోకి నేను అనుకోకుండా వచ్చాను. హీరో అవ్వాలని అసలు అనుకోలేదు. టెక్నీషియనో ఇంకేదో అవుదామనుకున్నాను. కానీ హీరో అవ్వడం అలా జరిగిపోయింది అన్నారు.

    ఏబాధ్యత ఇచ్చినా చేస్తానని రాజకీయ సందేశం

    ఏబాధ్యత ఇచ్చినా చేస్తానని రాజకీయ సందేశం

    నాకు ఏ పని ఇచ్చినా సరే అది తోట పని కావచ్చు, వీధులు ఊడ్చే పని కావచ్చు. ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా, చాలా నిజాయితీగా పని చేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను.... అని పరోక్షంగా తన రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.

    ఆ నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను

    ఆ నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను

    మీరన్న మాటలు నాకు వినిపిస్తాయి, వినిపించక కాదు...(అభిమానులు కాబోయే సీఎం అని అరుస్తుంటే) కానీ దానికి ఎందుకు స్పందించను అంటే ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదనే నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జరిగిందా మంచిది...జరుగలేదా ఇంకా మంచిది. దాని మీదే ఉండాలని లేదు. నా బిడ్డ ఒకటి.. మీ బిడ్డ ఒకటి కాదు.. మన అందరి బిడ్డలు ఒకటే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    నా ప్రతి సినిమా నా జీవితంలో

    నా ప్రతి సినిమా నా జీవితంలో

    మొట్టమొదటి సారిగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గోకుళంలో సీత చేసాను. నాకు త్రివిక్రమ్ గారికి పరిచయం అందరూ జల్సా సినిమా అనుకుంటారు లేదా అతడు సినిమా స్క్రిప్టుకు ముందు అనుకుంటారు. ఆయన గోకుళంలో సీతకు అసిస్టెంట్ రైటర్. ఆయన అప్పటి నుండి తెలుసు. కానీ పెద్దగా పరిచయం లేదు. ఎందుకు చెబుతున్నాను అంటే నా ప్రతి సినిమాలో నా జీవితంలో కొన్ని నేర్చుకున్నవి, నేను రియలైజ్ అయినవి జరిగాయి. అవి యాదృశ్చికంగా సినిమాల్లో వచ్చాయి. గోకుళంలో సీత సినిమాలో హీరో భోగం వదిలేసి భాధ్యత, యోగం వైపు నడుస్తాడు. అలాంటి పాత్ర అది. ఆయన(త్రిక్రమ్) రాసిన డైలాగులు నా జీవితంలో ఎంత కరెక్టుగా వచ్చాయంటే ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం అని తెలుసుకున్నాను.. అనే డైలాగులు ఈ రోజుకీ గుర్తుండి పోయాయి. చాలా గొప్ప డైలాగులు రాసే వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నాకు మిత్రుడు అవ్వడం చాలా ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.

    అది సుస్వాగతం సినిమాలో

    అది సుస్వాగతం సినిమాలో

    సుస్వాగతం సినిమాలో చదువు, బాధ్యత వదిలేసి కేవలం ప్రేమ అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే యువకుడి పాత్ర అది. తండ్రి చనిపోతాడు కొడుకు ఇలా తిరుగుతూ ఉంటే. దగ్గరున్నపుడు మనకు తల్లిదండ్రుల విలువ తెలియదు. వాళ్లు దూరం అయిపోయినపుడే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. అవన్నీ జరుగకుండానే నాకు తల్లిదండ్రుల విలువ తెలుసు. చిన్నప్పటి నుండి బాధ్యతగానే ఉండేవాడిని. ఆ సినిమా క్లైమాక్సులో నేను ఎంత ఎడ్చాను అంటే... నిజంగా ఏడ్చాను. నేను ఎంత ఏడ్చినా సరిపోక ఇంకా ఏడువాలని దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుగా చెప్పడంతో నాకు నేను చెంపలపై కొట్టుకుని ఏడ్చాను... అని పవన్ చెప్పుకొచ్చారు.

    మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపురాలేదు

    మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపురాలేదు

    సుస్వాగతంలో ఏడుపు సీన్ అయిపోయిన తర్వాత ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేక పోయాను. నిజంగా నా తండ్రి చనిపోతే నిజంగా ఏడుస్తానా? అనిపించింది. అలా జరుగకూడదు, అశుభం అని తెలిసినాగానీ నా వల్ల కాలేదు. జల్సా చేసే సమయంలో మానాన్నగారు చనిపోతే నాకు ఏడుపురాలేదు. ఆయన చనిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేసాను. ఆయన చనిపోయిన చిన్నదినం తర్వాత నేను వెళ్లి జల్సా షూటింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రతి సినిమా తాలూకు అనుభవం నా జీవితంలో జరిగింది. సినిమాను నేను సినిమాగా ఎప్పుడూ చూడలేదు. సినిమా నా జీవితం... నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావనలు చాలా జరిగాయి అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    తొలి ప్రేమ... అనుభవాల గురించి

    తొలి ప్రేమ... అనుభవాల గురించి

    ఒక వయసులో ఎంతసేపూ ఏముంటుంది మనకు..ఎప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరగాలి, ప్రేమించాలి, వాళ్లు మనల్ని గుర్తించాలి అనుకుంటాం. అప్పటికి నాకు ఏమనిపించింది అంటే బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనిపించింది. బాధ్యతలు విస్మరించి అబ్బాయిలు అమ్మాయిల చుట్టూ తిరిగి, అమ్మాయిలు అబ్బాయి చుట్టూ తిరిగి.... తల్లిదండ్రులకు ఏం చేసినట్లు అని అనిపించినపుడు కరుణాకరన్ గారు తొలిప్రేమ స్క్రిప్టు తీసుకొచ్చారు. ఇలా ప్రతి సినిమా నాలో కదిలే భావాలకు సినిమా రూపంలో వచ్చాయి... అన్నారు పవన్.

     తమ్ముడు సినిమాకు ప్రాణాలు పణంగా

    తమ్ముడు సినిమాకు ప్రాణాలు పణంగా

    తొలిప్రేమ తర్వాత నిజంగా నేను కష్టపడింది తమ్ముడు అనే సినిమాకే . సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఫాలోఅప్ హిట్ రావడం చాలా కష్టం. నా ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడ్డాను. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్లీ చేయాల్సి వచ్చింది. ఒక పిచ్చి ఉన్నాదంతో చేసాను. నన్ను ఇలా అభిమానిస్తున్నందుకు ఇంకా ఏదైనా ఇవ్వాలనే. అన్నికంటే నేను ఏం నమ్ముతానంటే... మన భవిష్యత్తు నిర్ణయించుకునేది మనమే. అది యువకుల్లో ఉన్న శక్తి. దానిని ఎవరో కూర్చొబెట్టి నువ్వు చేయలేవు ఇది నీ వల్ల కాదు అనే హక్కు ఎవవ్వరికీ లేదని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. అది నేను గుర్తించాను. నేను దారి నడిచాను. అలాంటి భావాలు వెతికే వారికి ఆ సినిమా ఎంతో కొంత స్పూర్తి కలిగించాలనే ఉద్దేశ్యంతో అయామ్ ట్రావెంలింగ్ సోల్జర్ అనే పాట పెట్టాము. నా గ్రోత్ ఆపడానికి మీరెవరు...నేను అనుకున్నంత నేను ఎదుగుతాను, మీరు అనుకున్నంత ఎదగను అనే మీనింగ్ ఉంది అందులో. అది నా ఒక్కడి గురించి మాట్లాడట్లేదు. నాలాగా ఉండే అందరి గురించి మాట్లాడుతున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    నా ఒక్కడి గురించి మాట్లాడట్లేదు

    నా ఒక్కడి గురించి మాట్లాడట్లేదు

    నేను చాలా చిన్న స్థాయి నుండి వచ్చాను. ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను కానీ ఇక్కడ మట్టుకు అడుగులు భూమిని తాకుండాలని కోరుకుంటాను. భూమికి బలంగా అతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    బద్రిలో చెప్పింది అదే

    బద్రిలో చెప్పింది అదే

    బద్రిలో ఏం పంచుకున్నాను అంటే ఇద్దరు అమ్మాయిలను మాత్రం కాదు...అది మీరు గుర్తుంచుకోవాలి. అది ఇద్దరు అమ్మాయిలను ప్రేమించే కథ అయినప్పటికీ అందులో విలన్ క్యారెక్టర్ నంద ఉంటుంది. నువ్వు నంద అయితే నేను బ‌ద్రి..బద్రినాథ్ అని చెప్పిన డైలాగ్‌.. కేవలం డైలాగ్ కాదు. ఎదిగే ప్రతి ఒక్కడు ఇంకొకడిని తొక్కేయాలని చూస్తాడు. ప్రతి ఒక్కడికి అహంకారం ఎక్కువ. నేనింత గొప్పోడిని కాబట్టి నువ్వు నాకింద పడి ఉండాలి. నీకు ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా నువ్వు కూడా నాలాంటి రక్తమాంసాలు ఉన్న మ‌నిషివే అని చెప్పడానికే ఆ డైలాగ్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    ఖుషి సినిమాకొచ్చేసరికి...

    ఖుషి సినిమాకొచ్చేసరికి...

    ఖుషి సినిమాలో దేశాన్ని ఎంత ప్రేమించాలి అని చెప్పాలనుకున్నా. దేశంలో అనం ఉండే ఏరియా. అందుకే నా మేరా జహా పాట చెపెట్టాను. అలా ఒక్కొక్క సినిమా ఒక్కోలా చెప్పాను అని పవన్ తెలిపారు.

    యాచకుడిలా...

    యాచకుడిలా...

    ఖుషి సినిమా రిలీజ్ ముందు హైటెక్ సిటీలో అంతా కలిసి సినిమా చూస్తున్నాం. సినిమా మధ్యలో నాకు ఏదో కీడు శంకించినట్లు అనిపించింది. రాబోయేది చాలా గడ్డుకాలం ఉంటుందని అనిపించింది. శక్తి అంతా కోల్పోయినట్లు అనిపించింది. నేను దెబ్బ తిన్నది తిరిగి శక్తిని పుంజుకోవడానికి గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తేగానీ ఆ శక్తి నాకు తిరిగి రాలేదు. అప్పటి దాకా నేను భగవంతుడి ముందు యాచకుడిలాగా చేతులు కట్టుకుని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడివ్వాలనుకుంటే అప్పుడే ఇవ్వు. నేను నిన్ను అడగను, ఇబ్బంది పెట్టను. నేను కర్మ చేసుకుంటూ వెళ్లిపోతాను అని రోజు భగవంతుడి ముందు తలమోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో అదే ఇవ్వు అని చెప్పి ఆయన్ను ఇంకేమీ అడగలేదు. ఖుషి తర్వాత నేను కోల్పోయిన శక్తి గబ్బర్ సింగ్ తో తిరిగి వచ్చింది. కానీ ఇది ఇక్కడితో ఆగదు. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఒకరోజు లెగుస్తాం ఇది నిరంతర పోరాటం. గెలుపు ఓటములను సమానంగా చూడాలన్నది అర్థం చేసుకున్నాను. అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకోవాలి అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    నన్ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ నేను శిరస్సు వచ్చి మోకరిల్లుతాను

    నన్ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ నేను శిరస్సు వచ్చి మోకరిల్లుతాను

    మొట్టమొదటి సారిగా సుస్వాగతం సినిమా హిట్టయితే కర్నూలులో ఫంక్షన్ చేసి రమ్మని పిలిచారు. అప్పటి వరకు నాకు అన్నయ్య చిరంజీవిగారి ఫంక్షన్లే, ఆయన అభిమానులే. నా ఉద్దేశంలో నాకెప్పుడూ చిరంజీవిగారే హీరో నేను హీరోను కాదు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ను అడిగాను...నన్ను చూడటానికి జనం ఎవరు వస్తారు అని. వాళ్లు ఇబ్బంది పడలేక వెళ్లాను. వెళ్లపోతే పొగరు అహంకారం అనుకుంటారని వెళ్లాను. అక్కడికెళ్లాక ఊరేగింపుగా తీసుకెళతామన్నారు. అప్పుడు నేనేమైనా గంగిరెద్దునా, నాకు ఇబ్బందిగా ఉంటుందని అడిగాను. దయచేసి నన్ను బలిపశును చేయొద్దని చెప్పినా నాకు వదల్లేదు. అప్పుడు నాకు నా తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. సృష్టిలో అందరూ సమానమే. నువ్వెప్పుడూ ఎక్కువ కాదు. భగవంతుడి... సృష్టి నువ్వెంతో వాళ్లు అంతే. ఇది అహంకారంగా నువ్వొక్కడివే అనకుంటే నాశనం అయిపోతావు అనే మాటలు నాలో ప్రతి ధ్వనించాయి. నన్ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ నేను శిరస్సు వచ్చి మోకరిల్లుతాను.

    కాటమరాయుడు నచ్చితే చూడండి

    కాటమరాయుడు నచ్చితే చూడండి

    ఇవాళ ఒక ఆలోచనతో సినిమా ఈ తీశాం. వీరం సినిమా రీమేక్. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తా. శరత్‌మరార్‌ మంచి మిత్రుడు ఆయన కోసమే ఈ సినిమా చేశా. డాలీ చాలా సున్నితమైన దర్శకుడు. నా జీవితంలో ఎప్పటికీ తమ్ముడినే. ఈ సినిమా పాత్ర ప్రకారం తొలిసారి అన్నయ్యను అయ్యాను... అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.

    English summary
    Check out Pawan Kalyan's Powerful Speech at Katamarayudu Pre Release Event. Katamarayudu, starring Pawan Kalyan is directed by Kishore Kumar Pardasani (Dolly), while Prasad Murella is the DOP and the music is being scored by Anup Rubens. The film will be edited by Gowtham Raju. Brahma Kadali is the art director and action will be composed by Ram - Laxman. Katamarayudu is produced by Sharrath Marar under the NorthStar Entertainment Banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X