Just In
Don't Miss!
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Automobiles
ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇల్లు లేదు కానీ సెల్ ఫోన్స్ : ఆవేదనతో పవన్
నెల్లూరు: ‘‘స్వచ్ఛ భారత్ గురించి మోదీ మాటలు విన్నప్పుడు నేను కూడా అనుమానించాను. ఇది సాధ్యమా అని అనిపించింది. అయితే, దాన్ని సాధ్యం చేయడం ఒకరిద్దరితోనే అయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యత పడాల్సి ఉంటుందని ఆ తరువాత తెలుసుకొన్నాను. అందువల్లనే నా వంతుగా నేను స్వచ్ఛభారత్‌లో పని చేస్తాను. నా అభిమానులకు కూడా ఇదే పిలుపునిస్తున్నాను'' అని చెప్పారు. దేశంలో ఇల్లు లేకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లు కనిపిస్తున్నాయని, కానీ, కనీస అవసరాలను మాత్రం తీర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘సంక్రాంతి సంబరా'ల్లో ఆత్మీయ అతిఽథిగా పాల్గొన్నారు. తనదైన శైలిలో నేతలకు చురకలు అంటిస్తూ పవన్ కల్యాణ్ ప్రసంగం సాగింది.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్ అంటే.. భారతీయ జనతా పార్టీనో, ప్రధాని మోదీనో కాదు. ప్రతి భారతీయుడి భాగస్వామ్యం ఉన్నప్పుడే అది సాధ్యం. సంవత్సరంలోనో లేదంటే ఐదేళ్లలోనో భారత్‌ను పరిశుభ్ర దేశంగా మార్చడం కుదిరే పనికాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ కార్యక్రమం కొనసాగాలి'' అని తెలిపారు.

‘‘స్వచ్ఛభారత్ అంటే ఫొటోలు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే పరిశుభ్రమైన సమాజం అవతరిస్తుంది'' అని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారం కోసం తెలుగు రాష్ర్టాల నుంచి ఎంపికచేసిన ప్రముఖుల్లో ఒకరైన పవన్ కల్యాణ్, తొలిసారి ఈ కార్యక్రమంపై స్పందించారు.
అలాగే... ‘‘టెక్నాలజీ పరంగా దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. కానీ, అదేదీ మనిషి అవసరాలకు ఉపయోగపడడంలేదు. ఇప్పటికీ ఆడబిడ్డలకు మరుగుదొడ్లు లేవు. ఉన్నావాటికి తలుపులు లేవు'' అని వాపోయారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిద్ధాంతం కోసం నిలిచే నేత అని, విభజనపై ఆయన ఒక్కరే పార్లమెంటులో పోరాడారని గుర్తు చేశారు.
ఇక ‘‘నేను నెల్లూరులోనే పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి వెంకయ్యనాయుడును చూస్తున్నాను. మా నాన్న ఆయనతో కలిసి జై ఆంధ్రా ఉద్యమంలో పోరాడారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను వెంకయ్య నెల్లూరుకు తీసుకువచ్చారు'' అని చెప్పారు. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకున్న యువకులు ఉన్నత శిఖరాలను అందుకుంటారని.. అందుకు మహారాష్ట్ర యువ ముఖ్యమంత్రి దేవేందర్ర ఫడ్నవీసే మంచి ఉదాహరణ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని.. అనంతరం మాట్లాడిన ఫడ్నవీస్ అన్నారు. క్రమశిక్షణ కలిగినవారే విజయాలు అందుకుంటారు. నటుడు పవన్‌కళ్యాణ్‌లో ఈ గుణాన్ని నేను చూశాను. ఆయన అభిమానులు సైతం.. అదే బాటలో నడవాలి'' అని ఆయన కోరారు. ‘స్వర్ణభారత్' నిర్వహిస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నది''అని అన్నారు.

పవన్ తాజా చిత్రాల విషయానికి వస్తే...
వెంకటేశ్, పవన్‌కల్యాణ్ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సురేశ్, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.
చిత్రం కథేమిటంటే...
దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.
దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటించారు.