»   » భారత దేశాన్ని ల్యాండ్ ఆఫ్ రేప్స్ అంటున్నారు.... అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు

భారత దేశాన్ని ల్యాండ్ ఆఫ్ రేప్స్ అంటున్నారు.... అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పింక్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ లేటెస్ట్ గా దేశం-మహిళలు-అభివృద్ధిలపై మనసులో మాట బయటపెట్టారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడివారు ఇండియా ని ల్యాండ్ ఆఫ్ రేప్స్ గా పిలుస్తున్నారని, అది తనకు చాలా ఆవేదన కలిగిస్తోందని అన్నారు. దేశంలో ప్రతీ ప్రాంతంలోని మహిళలు భద్రంగా ఉండాలని ఢిల్లీ కంటే ముంబై సేఫ్ అని చెప్పలేమని వ్యాఖ్యానించారు.

ఈ మాటలు తలచుకున్నప్పుడల్లా చాలా సిగ్గేస్తోంది. ఈ అపప్రథను తొలగించేందుకు భారతీయులందరూ కృషి చేయాలి. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా మహిళల భద్రతకు ఢోకా లేకుండా ఉండాలి. భారతను మూడో తరగతి దేశంగా గానీ, అభివృద్ధి చెందుతున్న దేశంగాగానీ పిలవడం నాకు ఇష్టం ఉండదన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా, ప్రథమ శ్రేణి దేశంగా భారత్‌ను రూపొందించేందుకు అందరూ కృషి చేయాలి. సమాజంలో యువతుల కన్యత్వం గురించి ప్రశ్నించిన సందర్భంలో పురుషుల శీలం గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరైనా ఒకటేననీ వివక్ష చూపటం సరికాదనీ అన్నారు.

 Amitab bacchan

అమితాబ్ నటించిన పింక్ ఇప్పుడు హాట్ టాపిక్ ఈ సినిమాకి అమితాబ్..తాప్సీల న‌ట‌నే హైలెట్ అని చెప్పాలి. మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డే లాయ‌ర్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు అమితాబ్. ఫ‌స్టాప్ లో మినాల్‌.. ఆమె స్నేహితులు రిసార్ట్‌కు వెళ్లిన రాత్రి ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌ను కొనసాగించ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాదించాడు.

ఇక సెకండాఫ్ లో కోర్టు స‌న్నివేశాలు...డైలాగ్ లు ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే నే అతి పెద్ద బ‌లం. కోర్టులో తాప్సీ చెప్పే డైలాగ్ లు ఆమె న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది.ఇటీవలే విడుదలైన 'పింక్' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. లాయర్ గా బిగ్ బీకి రైటర్స్ పవర్ ఫుల్ డైలాగులే రాశారు. ఈ డైలాగ్స్ అమితాబ్ పలకడంతో వాటి ఇంటెన్సిటీ మరింత ఎక్కువగా ఉంది. తనకోసం హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ రాసిన రచయితలను అదే పని గా పొగుడుతున్నారు.

English summary
Bollywood megastar Amitabh Bachchan made a shocking revelation about foreigners tagging India as 'the land of rape.'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu