వన్ మోర్ ధాట్ ప్రొడక్షన్స్ ,అజమ్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన 'ఫూంక్' చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.ఈ సినిమా ప్రమోషన్ చిత్రం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన వర్మ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని 22న విడుదల చేస్తున్నామని చెప్పారు.చేతబడి నేపధ్యంలో సాగే ఈ చిత్రం మూఢ నమ్మకాలు నమ్మాలా వద్దా అనే రీలితో సాగుతుందన్నారు.తులసీదళం నవల చదివిన స్పూర్తి తో ఇలాంటి సినిమా తీస్తున్నానని చెప్పారు. ఇందులో ప్రతీ పాత్ర కొత్తగా ఉంటుందన్నారు.సుదీప్,అమృతాఖన్విల్కర్,అహసాస్ ఛన్నా,శ్రేయబవ,జ్యోతి సుభాస్ ,అశ్వనీ ల్సెకర్ ముఖ్యపాత్రలు పోషించారు.