For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విశాల్-శృతి హాసన్ ఆయుధ ‘పూజ’ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో విశాల్ నిటిస్తూ నిర్మిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘పూజ'. యాక్షన్ చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు రిలీజ్ కాబోతోంది. గతంలో విశాల్ చేసిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ‘పూజ' చిత్రానికి మ్యూజిక్ చేసాడు.

  యువన్ సారథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ఆడియోను ఆదివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో విడుదల చేసారు. ఈ ఆడియోను శృతి హాసన్ ఆవిష్కరించి తొలి సీడీని హీరో నితిన్ కి అందించారు. థియేట్రికల్ ట్రైలర్ ను హీరో నితిన్ విడుదల చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో శరత్ కుమార్, ప్రముఖ నిర్మాత, విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ, హీరోలు నవీన్ చంద్ర, సందీప్ కిషన్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, రామ్, సింగర్ రఘు కుంచె తదితరులు పాల్గొన్నారు.

  నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ...‘విశాల్ మంచి ప్రొఫెషనల్ హీరో. హీరోగా నటిస్తూనే సినిమాలు నిర్మిస్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా తెలుగు, తమిళ భాషల్లో చాలా మంచి హిట్ అవుతుంది. యువన్ చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు అని తెలిపారు.

  చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ...‘పూజ అనేది సాఫ్ట్ టైటిల్ కాదు. అది ఆయుధ పూజ. ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్. ఇది నా 13వ సినిమా. విశాల్ తో రెండో సినిమా. యువన్ శంకర్ రాజాతో మూడో సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తాు. విశాల్, శృతి హాసన్ పెర్‌ఫార్మెన్స్ ఎక్సలెంట్' అన్నారు.

  హీరో నితిన్ మాట్లాడుతూ...‘నాకు ఇండస్ట్రీలో పరిచయమున్న మంచి వ్యక్తుల్లో విశాల్ ఒకరు. అన్ని విషయాలు మేం షేర్ చేసుకుంటాం. హరిగారి డైరెక్షన్ లో ‘పూజ' లాంటి యాక్షన్ ఎంటర్టెనర్ తో వస్తున్న విశాల్ కి ఆల్ ది బెస్ట్ చుబుతున్నాను. హరిగారి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్పీడుగా ఉంటుంది. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయి అందరికీ పేరు తేవాలని కోరుకుంటున్నాను' అన్నారు.

  హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ...‘పందెం కోడి తర్వాత విశాల్ మరో యాక్షన్ ఎంటర్టెనర్ ఇది. విశాల్, నేను ఎక్కడికి వెళ్లినా పందెం కోడి లాంటి సినిమా చెయ్యమని అడుగుతున్నారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఇక పందెం కోడిని మర్చిపోయి ‘పూజ' లాంటి సినిమా మళ్లీ రావాలని కోరుకునేలా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను' అన్నారు.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  నిర్మాత రామ్ మాట్లాడుతూ...

  నిర్మాత రామ్ మాట్లాడుతూ...

  ‘ఈ సినిమా తెలుగులో మేమే చేద్దామనుకున్నాం. కానీ, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బేనర్లోనే తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. అందుకే తమిళనాడులో ఈ చిత్రాన్ని మేమే విడుదల చేస్తున్నాం. దీపావళి తర్వాత సుసీంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ఓ సినిమా చెయ్యబోతున్నాం' అన్నారు.

  హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ...

  హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ...

  ‘ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చెయ్యలేదు. చాలా మంచి క్యారెక్టర్. యువన్ చాలా లవ్ లీ మ్యూజిక్ ఇచ్చారు. విశాల్ గారు ప్రొడ్యూసర్ గా ఎంతో ఎపర్ట్ పెట్టారు. తప్పకుడా ఆయన ప్రయత్నం ఫలిస్తుంది' అన్నారు.

  విశాల్ మాట్లాడుతూ...

  విశాల్ మాట్లాడుతూ...

  ‘యువన్ రీ-రికార్డింగులో ఉండటం వల్ల రాలేక పోయాడు. హరిగారు కూడా ఈ ఫంక్షన్ నుండి త్వరగా వెళ్లి పోయారు. ఎందుకంటే రేపు సినిమాను సెన్సార్‌కు పంపాల్సి ఉంది. పందెం కోడి నుండి ఈ సినిమా వరకు యువన్ నాకు చాలా మంచి మ్యూజిక్ చేసాడు. ‘భరణి' తర్వాత 7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అందుకే హరిగారితో మళ్లీ సినిమా చెయ్యాలనుకుంటున్నాను. మంచి సబ్జెక్టు కుదిరింది. తప్పకుండా మా బేనర్లో మంచి హిట్ అవుతుంది' అన్నారు.

  నటీనటులు, టెక్నీషియన్స్

  నటీనటులు, టెక్నీషియన్స్

  విశాల్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రాధిక, అభినయ, జయప్రకాష్, మనోబాల, తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: ప్రియన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరి.

  English summary
  Vishal, Sruti Hasan starrer Pooja film audio release function held at Annapoorna 7 acers on Sunday (6th Oct) evening Sruti Hassan released the audio handed over the first CD to Nitin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X