»   » భర్తకు దూరం.. ఐదేళ్ల నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. నాగ్ హీరోయిన్ కథ ఇది..

భర్తకు దూరం.. ఐదేళ్ల నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం.. నాగ్ హీరోయిన్ కథ ఇది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గ్రీకువీరుడు, సిసింద్రీ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి పూజాబాత్రా మరోసారి వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది. ఎన్నారై వరుడిని వివాహం చేసుకొన్న తర్వాత మళ్లీ ఇటీవల వచ్చిన ఏబీసీడీ2 చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున్న మెరిసింది. ఆ తర్వాత మిర్రర్ గేమ్ - అబ్ ఖేల్ షురూ అనే చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నది. వ్యక్తిగత విబేధాల కారణంగా భర్త నుంచి విడిపోయిన ఆమె ఐదేళ్ల నుంచి బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నది. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్ కార్యక్రమాలను వివరించింది. క్షత్రియ పుత్రుడు‌కు రీమేక్ వచ్చిన విరాసత్‌లో అనిల్ కపూర్ పక్కన, హసీనా మాన్ జాయేగి లాంటి చిత్రాల్లో నటించిన ఆమె మళ్లీ బాలీవుడ్‌లో పాత వైభవాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నది.

నాగార్జునతో ..

నాగార్జునతో ..

తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో పూజాబాత్రా నటించింది. ఆ తర్వాత సిసింద్రీ సినిమాల్లో నాగార్జునకు జోడీగా అతిథి పాత్రలో కనిపించింది. నాగార్జునతో కలిసి నటించిన పాట హల్లో పిల్లా అనే సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నది.

సెక్స్ బానిసగా..

సెక్స్ బానిసగా..

ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్, ముంబై మధ్య ప్రయాణం జరుగుతున్నది. సెక్స్ బానిసల మీద డాక్యుమెంటరీలో నటించాను. ఇది భారత్‌లోని ఓ అమ్మాయి దీనగాథ. వేశ్య వృత్తి నుంచి ఎలా బయటపడ్డారనే కోణంలో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించాం. మరో హాలీవుడ్ చిత్రం ‘వన్ అండర్ ది సన్' అనే చిత్రంలో నటించాను. గతేడాది కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. గతేడాది ఇండియాకు వచ్చి ఏబీసీడీ2 చిత్రంలో నటించాను. మరో పంజాబీ చిత్రంలో కూడా మంచి పాత్ర పోషించాను.

పాత్ర కోసం థెరపీ..

పాత్ర కోసం థెరపీ..

ప్రస్తుతం మిర్రర్ గేమ్ అనే సినిమాలో నటించాను. ఆ చిత్ర షూటింగ్ అంతా అమెరికాలో జరిగింది. మిర్రర్ గేమ్ చిత్రంలో నా పాత్ర పేరు డాక్టర్ రాయ్. ఇది సస్పెన్స్ థ్రిల్లర్. స్క్రిప్ట్ చదివినప్పుడే అద్భుతం అనిపించింది. తర్వాత వచ్చే సన్నివేశంలో ఏ జరుగుతుంది అనే ఆసక్తిని పెంచుతుంది. ఈ పాత్ర కోసం మానసిక చికిత్సకు సంబంధించిన విధానాన్ని గురించి తెలుసుకొన్నాను. అందుకోసం ప్రత్యేకంగా థెరపీ తీసుకొన్నాను. థెరపీస్టులు ఎలా బిహేవ్ చేస్తారనేది తెలుసుకోవడం ద్వారా డాక్టర్ పాత్రను సులభంగా పోషించాను.

స్నేహితులను మిస్ అయ్యా..

స్నేహితులను మిస్ అయ్యా..

అమెరికాకు వెళ్లడం వలన బాలీవుడ్‌లో చాలా మంది స్నేహితులను, సన్నిహితులను కోల్పోయాను. ఇప్పటికీ అక్షయ్ కుమార్, ట్వింకిల్ దంపతులతో మంచి సంబంధాలు ఉన్నాయి. మళ్లీ నా మిత్రులతో కలిసి నటించాలని ఉంది. నాకు అమెరికాలో గ్లోవ్ బెల్స్ ఇంక్ అనే సంస్థతో మంచి సంబంధాలు ఉన్నాయి. సిల్వెస్టర్ స్టాలెన్, డినైస్ రిచర్డ్స్ లాంటి దిగ్గజ నటులను బాలీవుడ్ చిత్రాల్లో నటింపజేయాలన్నది ఆ సంస్థ లక్ష్యం. ఇండియన్ చిత్రాల్లో నటించాలన్న చాలా మంది హాలీవుడ్ నటులకు ఆసక్తి ఉంది.

ఐదేళ్లుగా సహజీవనం..

ఐదేళ్లుగా సహజీవనం..

వ్యక్తిగత విభేదాల కారణంగా భర్తతో విడాకులు తీసుకొన్నాను. గత ఐదేళ్లుగా క్రిస్టియన్ అనే బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నాను. అంతకంటే నా వ్యక్తిగత జీవితం గురించి మీరు అడుగవద్దు. మేము చెప్పవద్దు అని పూజాబాత్రా అన్నారు. అయితే నా భర్తతో స్నేహ సంబంధం కొనసాగుతున్నది. మా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి అని ఆమె తెలిపారు.

English summary
Pooja Batra, best remembered for her roles in Virasat and Haseena Maan Jayegi, took a break from Bollywood when she got married and settled in the USA. After eight years of marriage and divorce, she made a comeback to Bollywood with a small, but pivotal role in ABCD 2. she said, It’s not a new relationship. I have been with my boyfriend Christian for five years now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu