»   » మళ్లీ డ్రగ్స్‌కు బానిసైన హీరోయిన్.. దుర్భర జీవితం.. నాన్నా పాపాలను కడిగేసుకొంటా..

మళ్లీ డ్రగ్స్‌కు బానిసైన హీరోయిన్.. దుర్భర జీవితం.. నాన్నా పాపాలను కడిగేసుకొంటా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ దర్శకుడు మహేశ్‌భట్ కూతురుగా బాలీవుడ్‌లోకి ప్రవేశించిన పూజాభట్ 90వ దశకాలలో వెండితెరపై దుమ్ము రేపింది. సంజయ్ దత్‌తో కలిసి నటించిన సడక్ లాంటి ఆమె నటించిన చిత్రాలు అభిమానులను ఆలరించాయి. అమీర్‌ఖాన్‌తో నటించిన చిత్రం దిల్ హై కి మాన్తా నహీ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అయితే అనూహ్యంగా ఆమె కెరీర్ మసకబారింది. చివరిసారిగా 2001లో తెరమీద కనిపించింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా మారాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి మద్యం, డ్రగ్స్‌కు బానిసగా మారడం విషాదంగా మారింది. ఆ విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలపై దృష్టిపెడుతున్నట్టు ఇటీవల మీడియాకు వివరించింది.

  మళ్లీ మద్యానికి బానిస

  మళ్లీ మద్యానికి బానిస

  మద్యం నుంచి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేసింది. రిలీఫ్ సెంటర్లలో శిక్షణ తీసుకొన్నది. అవి కొంత మేరకు సత్పలితాలు ఇచ్చాయి. మద్యం నుంచి విముక్తి పొందింది. జీవితంలో చోటుచేసుకొన్న ఎగుడుదిగుడు సంఘటనలు మళ్లీ డ్రగ్స్, మద్యం వైపుకు అడుగులు వేసేలా చేశాయి.

  సినిమాలపై దృష్టి..

  సినిమాలపై దృష్టి..

  కానీ గత మార్చిలో జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నది. తండ్రి మహేశ్ భట్ సూచన మేరకు మద్యం, డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలను చేపట్టింది. అందులో భాగంగానే సినిమాలపై దృష్టిపెట్టినట్టు సమాచారం.

  సిటీ ఆఫ్ డెత్‌ను సినిమాగా

  సిటీ ఆఫ్ డెత్‌ను సినిమాగా

  ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునే లేచి మళ్లీ సినీ పరిశ్రమలో నిలదొక్కకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. అభిక్ బారువా అనే రచయిత రాసిన సిటీ ఆఫ్ డెత్ అనే పుస్తకం ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నది.

  పుస్తకానికి తెరరూపం

  పుస్తకానికి తెరరూపం

  తన స్నేహితుడి కోరిక మేరకు ఆ పుస్తకాన్ని చదివాను. పుస్తకంలోని కథ నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ పుస్తకానికి తెర రూపం ఇవ్వాలని అప్పుడే అనుకొన్నాను. నా జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను పోషించాలని అనుకొన్నాను.

  పాపాలను కడిగేసుకోవాలనుకొంటున్నా..

  పాపాలను కడిగేసుకోవాలనుకొంటున్నా..

  నాన్న (మహేశ్ భట్)‌కు ఫొన్ చేసి నేను చేసిన పాపాలను కడిగేసుకోవాలనుకొంటున్నా. అందుకే కథను తెరకెక్కించాలని అనుకొంటున్నాను అని చెప్పాను. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నట్టు పూజాభట్ ధ్రువీకరించింది. ఈ చిత్రంలో కోల్‌కతా మద్యం దందాను అరికట్టే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా పాత్రను పోషిస్తున్నట్టు పేర్కొన్నారు.

  కోల్‌కతా నేపథ్యంగా

  కోల్‌కతా నేపథ్యంగా

  కోల్‌కతా నేపథ్యంగా ఈ కథ జరుగుతుంది. నా నాన్నమ్మ కూడా కోల్‌కతాలోనే జీవించింది. ఆ నగరంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ కథలో భావోద్వేగం ఉంది. మద్యానికి అలవాటు పడిన తండ్రి, మానసిక వేదనకు గురయ్యే తల్లి, సెక్స్ బానిస అయిన సోదరుడు, ప్రియుడు భావోద్వేగం ఈ కథలో ని అంశాలు అని పేర్కొన్నది.

  మహమ్మారిని ఎదురిస్తా..

  మహమ్మారిని ఎదురిస్తా..

  మద్యానికి బానిస అయిన నేను.. ఆ మహమ్మారి నుంచి బయటపడేందుకే ఈ సినిమాను చేస్తున్నాను. ఆల్కాహాల్ ‌నుంచి నేను విముక్తి కావాలనుకొంటున్నాను. మరికొందరికి స్ఫూర్తిగా నిలువాలని అనుకొంటున్నాను అని పేర్కొన్నారు.

  జీవితానికి దగ్గరగా ఉన్న కథ..

  జీవితానికి దగ్గరగా ఉన్న కథ..

  సిటి ఆఫ్ డెత్ అనే చిత్రం ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్. నా జీవితానికి దగ్గరగా ఉన్న కథ. అలాంటి కథకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాను. పలు నగరాల్లో పర్యటించి కథకు సరిపోయే కొత్త క్యారెక్టర్లను సృష్టించాలనుకొంటున్నాను. ప్రపంచంలో చోటుచేసుకొన్న నేర కథలపై అధ్యయనం చేస్తున్నాను.

  సిటీ ఆఫ్ డెత్‌తో

  సిటీ ఆఫ్ డెత్‌తో

  2003లోనే జాన్ అబ్రహం హీరోగా పాప్ అనే సినిమాకు పూజాభట్ దర్శకత్వం వహించింది. గత కొద్దికాలంగా నటనకు దూరమై సినిమాల నిర్మాణంపైనే పూర్తిస్థాయి దృష్టిని పెట్టింది. ప్రస్తుతం సిటీ ఆఫ్ డెత్‌తో మళ్లీ నట విశ్వరూపం చూపాలని అనుకొంటున్నది.

  English summary
  Pooja Bhatt admitted to being a victim of an alcoholic addiction. After being in love with her bottle for over decades, the actress in one of her interviews in March had revealed how a text message from her dad Mahesh Bhatt made her rethink about her addiction and that now she has been sober since then.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more