»   » డైరెక్టర్‌తో సీక్రెట్ మ్యారేజ్: హీరోయిన్ పూనమ్ బజ్వా స్పందన

డైరెక్టర్‌తో సీక్రెట్ మ్యారేజ్: హీరోయిన్ పూనమ్ బజ్వా స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: హీరోయిన్ పూనమ్ బజ్వా, దర్శకుడు సునీల్ రెడ్డి వివాహం రహస్యంగా రిజిస్టర్ ఆఫీసులో జరిగినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు వీరు ఇంత రసహ్యంగా ఎందుకు పెళ్లి చేసుకున్నారనే విషయం చర్చనీయాంశం అయింది. మీడియాలో ప్రచారం కావడంతో విషయం పూనమ్ బజ్వా వరకు వెళ్లింది. దీనిపై ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. తనకు ఎవరితోనూ వివాహం కాలేదని క్లారిటీ ఇచ్చారు.

  పూనమ్ బజ్వా స్పందిస్తూ....'హాయ్ ఆల్, నాకు పెళ్లి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అవి కేవలం రూమర్స్ మాత్రమే. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు. మా చెల్లెలి వివాహం ఇటీవలే జరిగింది. బాహుషా ఆ కారణంగా కొంత మంది కన్ ఫ్యూజ్ అయి నాకు కూడా పెళ్లి జరిగిందని భావించి ఉంటారు' అని వివరణ ఇచ్చారు.

   Poonam Bajwa Reacts To Her Marriage Rumors, Talks About Director Sunil Reddy

  సునీల్ రెడ్డి గురించి కూడా పూనమ్ బజ్వా స్పందించారు. సునీల్ రెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్. మేము కాస్త క్లోజ్ గా ఉండటం చూసి ఎవరో ఏదో ఊహించుకుని ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెచ్చి ఉంటారు. మాకు వివాహం జరిగిందనే ప్రచారంలో నిజం లేదు అని పూనమ్ బజ్వా తేల్చి చెప్పారు.

  పూనమ్ బజ్వా సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం తమిళంలో సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఒక సునీల్ రెడ్డి సాయి ధరమ్ తేజ్ తో 'తిక్క' అనే సినిమా చేస్తున్నారు.

  English summary
  Actress Poonam Bajwa was rumored to have tied knot to director Sunil Reddy in a private ceremony, a few days ago. The reports claimed that, Poonam and Sunil were seeing each other since a long time and has got married in a register office, without meeting the media eye. However, Poonam Bajwa reacted promptly and has cleared the air that she not been married to anyone and the reports are mere gossips.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more