»   » అతని కంటే పెద్ద తీవ్రవాది లేడు: స్టార్ హీరోపై పోసాని కామెంట్స్

అతని కంటే పెద్ద తీవ్రవాది లేడు: స్టార్ హీరోపై పోసాని కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాను ఏది అనుకుంటే అది ముక్కుసూటింగా చెప్పే పోసాని..... తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ మీద తనదైన పదునైన కామెంట్స్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని సల్మాన్ ను తీవ్రవాది విరుచుకుపడ్డారు.

భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటులను దేశం విడిచి వెళ్ళాలని ఎంఎన్ఎస్ పార్టీ బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వారికి అవకాశాలు ఇవ్వడానికి కూడా పలువురు ఫిల్మ్ మేకర్స్ భయ పడుతున్నారు.

మద్దతు ఇచ్చిన సల్మాన్

మద్దతు ఇచ్చిన సల్మాన్

యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై స‌ల్మాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్థాన్ సినీ న‌టులు భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు.

వారు ఉగ్రవాదులు కాదన్న సల్మాన్

వారు ఉగ్రవాదులు కాదన్న సల్మాన్

యూరీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే.. కానీ న‌టీన‌టులు కాదన్నారు. పాక్ ఆర్టిస్టులు ఉగ్ర‌వాదులు కాదన్నారు. న‌టీన‌టులు, ఉగ్రవాదులు వేర్వేరు అని ఆయ‌న చెప్పుకొచ్చారు. స‌రైన వీసా వ‌ర్క్ ప‌ర్మిట్‌తో భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు. ఎంతో మంది పాక్ క‌ళాకారుల‌కు ఇక్క‌డ నివ‌సించ‌డానికి వాలిడ్ వీసా ఉంద‌ని గుర్తుచేశారు. అదేసమయంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనాలన్నారు సల్మాన్.

అందుకే పోసానికి కాలింది

అందుకే పోసానికి కాలింది

పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచిన సల్మాన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని పోసాని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఉత్తముడేం కాదు

ఉత్తముడేం కాదు

సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడేం కాదని, అతడు ఉత్తముడైతే, ఆరోజు తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు పోసాని.

చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్....

చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్....

చిరు నిజాయితీ పరుడే, కానీ పవన్.... అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Posani Krishna Murali Controversial Comments Salman Khan.
Please Wait while comments are loading...