»   » ఎన్టీఆర్ ని కొలిచే మీటర్ అదే: యంగ్ టైగర్ గురించిపోసాని స్పీచ్ ఇలా

ఎన్టీఆర్ ని కొలిచే మీటర్ అదే: యంగ్ టైగర్ గురించిపోసాని స్పీచ్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

జై లవకుశ సక్సెస్ మీట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేసాడు. నిజానికి పోసాని ఎవరిని పొగిడినా పొగడ్త లాగా అనిపించదు అదే నిజం ఇక దీనిమీద ఎవ్వరూ ఏమీ చెప్పటానికి లేదు అన్నంత పక్కాగా చెప్పేస్తాడు. ఏమో పోసాని మాటల్లో ఆ నిజమూ ఉంటుంది కాబట్టే అవి పొగడ్తలలాగా అనిపించవు. అదే పద్దతిలో ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గురించి చెప్పాడు....

జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్.. పాల స్వచ్ఛతను కొలవడానికి లాక్టోమీటర్ ఉన్నట్టే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనను కొలవడానికి కూడా ఓ పరికరం ఉందన్నారు. తెలుగులో రసహృదయం అంటారని అన్నాడు. ఈ రసహృదయం ఉన్నవాడు ఎన్టీఆర్ నటనలో దమ్ముఎంతుందో కొలవగలడని చెప్పాడు.

Posani Speech at Jai Lava Kusa Success Meet

ఎన్టీఆర్ తో తాను 'టెంపర్', 'జై లవకుశ' సినిమాలు చేశానని, ఆయనతో కాంబినేషన్ సీన్ చేయాలంటే తానే ఎంతో భయపడతానని అన్నాడు. ఛైల్డ్ ఆర్టిస్టుని కదా ఏం ఫర్వాలేదులే అనుకునేవాడినని తెలిపాడు. అయితే ఆయన యాక్ట్ చేసిన తరువాత అక్కడ మరెవరూ కనిపించరని పోసాని అన్నాడు.

ఒక సీన్ ని గంట ముందు తీసుకుని బై హార్ట్ చేసి ఎన్టీఆర్ ముందుకు వెళ్లి చేసిన తరువాత ఇది సరిపోదేమో అనిపించేదని, తాను ఎన్టీఆర్‌తో టెంపర్, జై లవకుశ చేశానని.. ఆయనతో యాక్ట్ చేస్తుంటే తానేం కనపడతానని భయపడ్డానన్నారు. తెర మీద ఓ మెర్క్యురిలా ఎవ్వరినీ యాక్ట్ చేయనివ్వడు.. అంటే ఆయన నటన ముందు తామెవ్వరం కనపడం అని చాలా మందిభావిస్తారన్నారు. ఒక సీన్‌ని గంట ముందు తీసుకుని బైహార్ట్ చేసి ఎన్టీఆర్ ముందుకెళ్లేవాడినని పోసాని తెలిపారు.

English summary
Posani Krishna Murali speaks at Jai Lava Kusa Success Meet. Jr NTR's acting skills can be measured only by people with aesthetic sense, says Posani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu