»   » వాళ్లు డబ్బులైతే అడగలేదు: మేడమ్ టుస్సాడ్స్‌లో తన విగ్రహంపై ప్రభాస్

వాళ్లు డబ్బులైతే అడగలేదు: మేడమ్ టుస్సాడ్స్‌లో తన విగ్రహంపై ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మా ఫ్రెండ్ ఫోన్ చేసి మేడమ్ టుస్సాడ్స్ వారు నీ విగ్రహం మ్యూజియంలో పెడతామని చెప్పారని చెప్పగానే నేను నమ్మలేక పోయాను. బాహుబలిలో అద్భుతం జరిగితే ఏదేదో జరుగుతాయని అనుకున్నాం కానీ మేడమ్ టుస్సాడ్స్ వారు సైతం వస్తారని అసలు ఊహించలేదు... అని ప్రభాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

ఆ సమయంలో నేను బాహుబలి షూటింగులో ఉన్నాను. ఈ విషయం రాజమౌళికి చెప్పగానే చాలా సంతోష పడ్డాడు. సౌతిండియా నుండి ఇదే తొలిసారి. ఓసారి వచ్చి హాఫ్ డే పాటు కొలతలు తీసుకున్నారు. సూపర్ హీరోలు కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్ లాంటి విగ్రహాల మధ్యలో మన బాహుబలి ఉంటదంటే సంతోషంగా అనిపించిందని ప్రభాస్ తెలిపారు.

డబ్బులు అడగలేదు

డబ్బులు అడగలేదు

మీరు హైట్ ఎక్కువ కదా, మీ విగ్రహానికి కాస్త వాక్స్ ఎక్కువ పడుతుంది కదా... అని యాంకర్ సుమ చమత్కరించడంతో ప్రభాస్ నవ్వేసారు. కొలతలు తీసుకెళ్లారు కానీ వాళ్లకి ఎంత వాక్స్ అవసరం అవుతుందో తెలియదు... మనల్ని అయితే డబ్బులు అడగలేదు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

మేడమ్ టుస్సాడ్స్

మేడమ్ టుస్సాడ్స్

మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ లలో ఏర్పాటు చేసి తమ మ్యూజియంలలో ప్రతిష్టిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ విగ్రహాల తయారీకి కూడా ఖర్చు భారీగానే అవుతుంది. ఒక్కో విగ్రహం తయారీకి లక్షా యాభై వేల బ్రిటిష్ పౌండ్లు ఖర్చవుతున్నాయి. అంటే మన కరెన్సీలో ఒక్కో విగ్రహం తయారీకి అయ్యే ఖర్చు దాదాపు రూ. కోటిన్నర...

ప్రభాస్ విగ్రహం

ప్రభాస్ విగ్రహం

ప్రస్తుతానికి బాహుబలి స్టార్ ప్రభాస్ విగ్రహాన్ని బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దాదాపు రూ. కోటిన్నర ఈ విగ్రహం తయారీకి ఖర్చు పెడుతున్నారట.

ఎందుకింత ఖర్చు?

ఎందుకింత ఖర్చు?

ఈ విగ్రహం తయారీకి అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్టిస్టులు పని చేస్తారు. విగ్రహాన్ని, ప్రభాస్ ను పక్క పక్కనే పెట్టి కంపేర్ చేస్తే.... పోల్చుకోలేనంత పర్‌ఫెక్టుగా ఉంటుంది. కనురెప్పలు, జుట్టు, బాడీ కలర్, ఇలా ప్రతి అంశంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రత్యేకంగా ఆర్టిస్టులు లండన్ నుండి ఇండియాకు పలు సందర్భాల్లో ట్రావెల్ చేసి కొలతలు తీసుకోవడం లాంటివి చేస్తారు. అన్ని కలిపి ఒక విగ్రహం తయారీకి కోటిన్నర వరకు ఖర్చవుతుంది.

ఎవరు భరిస్తారు?

ఎవరు భరిస్తారు?

అయితే ఇంత ఖర్చు పెట్టి మైనపు విగ్రహాలు తయారు చేయాల్సిన అవసరం వారికి ఏమిటి? ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? అనే డౌట్ మీకు రావొచ్చు. అయితే ఈ ఖర్చులన్నీ మ్యూజియం నిర్వాహకులే భరిస్తారు. మ్యూజియం నిర్వహణ కోసం సందర్శకుల నుండి టికెట్స్ రూపంలో వసూలు డబ్బు వసూలు చేస్తారు.

English summary
Prabhas comments about his wax statue in Madame Tussauds Museum. Checkout details.
Please Wait while comments are loading...