Don't Miss!
- Sports
Virat Kohli : కోహ్లీని ఇబ్బంది పెట్టిన బౌలర్.. వీడిని ఆడటం చాలా కష్టమన్న విరాట్!
- News
Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సాహో యాక్షన్ సన్నివేశాలు లీక్.. మెరుపు వేగంతో ఛేజింగ్, వైరల్ అవుతున్న వీడియోలు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. సాహో చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్టన్ సన్నివేస్లు లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
|
మొదలైన లీకులు
చిత్ర పరిశ్రమలో లీకుల బెడద పెద్ద చిత్రాలకు ఎప్పుడూ ఉంటుంది. తాజాగా సాహో చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిబ్యా అనే వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియోలో లీక్ అయ్యాయి. ఆ వీడియోలు మేకింగ్ దశలోనివే కావడం చిత్ర యూనిట్ కు కాస్త ఊరటనిచ్చే అంశం. ఛేజింగ్ సన్నివేశాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఈ చిత్రంలోని శ్రద్ధ కపూర్, ప్రభాస్ రొమాంటిక్ స్టిల్ ఒకటి లీకైన సంగతి తెలిసిందే.
|
బైక్ ఛేజింగ్ సీన్స్
ఈ వీడియోల్లో ప్రభాస్ బైక్ ఛేజింగ్ సన్నివేశాల్లో నటిస్తూ కనిపిస్తున్నాడు. మరో వీడియోలో మొదట విడుదల చేసిన టీజర్ లో జెట్ మాన్ గా ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. మరో వీడియోలో భారీ భవనాల మధ్య రాజదారుల్లో.. పెద్ద పెద్ద వాహనాల్ని, కారులని దాటుకుని బైక్ పై వేగంగా వెళుతున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
|
మండిపడుతున్న అభిమానులు
షూటింగ్ వీడియోలు లీక్ కావడంతో ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.వీడియోలు తొలగించాలని దిబ్యా అనే వ్యక్తికి సూచిస్తున్నారు. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెబుతోంది. దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాల్లో సాహో చిత్రయూనిట్ కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించింది.

విడుదలకు సిద్ధం అవుతూ
ప్రస్తుతం సాహో చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 15న సాహో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో చిత్రయూనిట్ త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఇండియన్ స్క్రీన్ లో మునుపెన్నడూ చూడని విధంగా సాహోలో ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎవిలిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.