twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adipurush:ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సమ్మర్ కు కూడా రాని ఆదిపురుష్, మరో వంద కోట్ల ఖర్చు!

    |

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమాను సంక్రాతికి రిలీజ్ చేద్దామని భావించిన చిత్రబృందం సినిమా టీజర్ ను అక్టోబర్ 2న విడుదల చేసింది. ఈ టీజర్ చూసి ప్రేక్షకులే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. తీవ్రంగా నిరాశ చెందారు. ఈ సినిమా అయిన ప్రభాస్ కు హిట్ తెస్తుందేమోనని డార్లింగ్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు టీజర్ చూశాక అడియాశలు అయ్యాయి. పలు కారణాలతో రిలీజ్ డేట్ ను మారుస్తూ వేసవికి తీసుకొస్తామని చెప్పింది టీమ్. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ టీమ్ మరో బ్యాడ్ న్యూస్ తెలిపింది.

     ప్రతి సినిమా పాన్ ఇండియాగా..

    ప్రతి సినిమా పాన్ ఇండియాగా..

    జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా ఎనలేని పేరు తెచ్చుకున్నాడు. దీంతో ప్రభాస్ ఆ సినిమా తర్వాత ప్రతి మూవీని పాన్ ఇండియాగా ప్లాన్ చేశాడు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ అంతగా ప్రేక్షకులును మెప్పించలేకపోయాయి. ఇక ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ పై పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చూసి దానిపై ఆశలు వదిలేసుకున్నారు.

    టెంపుల్ రన్ గేమ్ లా..

    టెంపుల్ రన్ గేమ్ లా..

    ఆదిపురుష్ టీజర్ ప్రభాస్ ఫ్యాన్ ను ఎంతగానో నిరాశపరిచింది. ఆదిపురుష్ టీజర్ ఒక ప్లానేట్ ఆఫ్ ది ఏప్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, పైరెట్స్ ఆఫ్ ది కరెబియన్ వంటి చిత్రాల నుంచి కాపీ కొట్టి వింత జీవులను సృష్టించాడని ఆరోపించారు. ఈవిల్ డెడ్ లో ఉన్న గ్రాఫిక్స్ లా ఆ వింత జీవులేంటని మీమ్స్ తో కడిగేశారు. మళ్లీ హనుమంతుని సైన్యంలో ఒక పాత్ర టెంపుల్ రన్ గేమ్ లా ఉందని, అసలు ఈ సినిమా కోసం నిజంగానే రూ. 500 కోట్లు ఖర్చుపెట్టారా అనేక రకాలు ఎక్కువగా కామెంట్ చేశారు.

     బిగ్ స్క్రీన్ అనుభూతి కోసం..

    బిగ్ స్క్రీన్ అనుభూతి కోసం..

    అంతేకాకుండా ఈ సినిమా టీజర్ పై అనేక మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక వీటన్నింటిపైనా డైరెక్టర్ ఓం రావత్ స్పందించారు. ''ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం సినిమా తీశాం. ప్రేక్షకుల ఆనందం కోసం సినిమా టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేశాం. మొబైల్ ఫోన్ లో టీజర్ చూస్తే కొంత భిన్నంగా ఉంటుంది. మీమ్స్, ట్రోల్స్ నన్ను సర్ ప్రైజ్ చేయలేదు.

    థియేటర్లకు రప్పించేందుకే..

    థియేటర్లకు రప్పించేందుకే..

    యూట్యూబ్ ఛానల్ కోసం మేము సినిమా తీయలేదు. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు మాత్రమే కాదు.. మారుమూల గ్రామాల ప్రజలను కూడా థియేటర్లకు రప్పించేందుకే ఆదిపురుష్ ఇలా తెరకెక్కించాం'' అని ఓం రావత్ తెలిపాడు. ఇక ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పుడు చిరంజీవి వంటి తదితర స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధం కావడంతో వాయిదా వేశారు.

    ప్రతిసారి నిరాశే..

    ప్రతిసారి నిరాశే..

    అయితే ఇప్పుడు మరోసారి ఆదిపురుష్ సినిమాను వాయిదా వేస్తూ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం. ఆదిపురుష్ సినిమా సమ్మర్ రేసు నుంచి కూడా తప్పుకుందని తెలుస్తోంది. దీనిగురించి డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఆల్రెడీ చెప్పేశారని ఓ టాక్ వినిపిస్తోంది. ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రతిసారి నిరాశే ఎదురవుతోందని అనుకుంటున్నారు. అయితే పాన్ ఇండియాగా తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాఫిక్ వర్క్ కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే.

     మరో వంద కోట్ల ఖర్చు..

    మరో వంద కోట్ల ఖర్చు..

    చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ ను అనేకమంది ట్రోల్ చేశారు. సినిమాలోని పాత్రలన్నీ కార్టూన్ లా కనిపిస్తున్నాయని, ముఖ్యంగా రావణాసురిడు ఖిల్జీలా ఉన్నాడని అనేక మంది విమర్శించారు. దీంతో వీరందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆదిపురుష్ ను మరోసారి పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. ఈ సమయాన్ని మూవీ టీమ్ విజువల్ ఎఫెక్ట్స్ పై పనిచేయాలని డిసైడ్ అయిందట. తాజాగా చేసే ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరో రూ. 100 కోట్లు ఖర్చు చేయనున్నారని టాక్.

    English summary
    Prabhas And Om Raut Combination Movie Adipurush Again Postponed From Summer Race And Movie Team Re Work On Better Visual Effects Which Cost Is Rs. 100 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X