»   » ప్రభాస్ చేతులమీదుగా మోషన్ పోస్టర్..! నవ్వి నవ్వి చచ్చిపోతారంతే (వీడియో)

ప్రభాస్ చేతులమీదుగా మోషన్ పోస్టర్..! నవ్వి నవ్వి చచ్చిపోతారంతే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నట్టు బిల్డప్పిస్తున్న తాప్సీ కొన్ని రోజుల కిందట తాలీవుడ్ మీద పెద్ద విమర్షలే చేసింది. ఇక్కడ డబ్బులు ఇవ్వరనీ, అసలు హీరోయిన్ కి ప్రాధాన్యత ఉందదనీ, నటనకు అవకాశమే ఉండదనీ ఇలా చాలానే మాట్లాడింది. తీరా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఓకటీ రెండు తప్ప పెద్ద అవకాశాలు రాకపోవటం... అవచ్చినవి కూడా తనకి కమర్షియల్ గా పెద్ద ప్లస్ అయ్యేవి కాకపోవటం తో. మళ్ళీ టాలీవుడ్ వైపు కూడా ఒక హ్యాండ్ ఉంచాలనుకుందేమో... చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో స్ట్రైట్ చిత్రం చేస్తుంది.

తాప్సీ

తాప్సీ

ఇటీవ‌ల ఘాజీ చిత్రంతో ప‌ల‌క‌రించిన సినిమాలో ఈ అమ్మ‌డి నిడివి త‌క్కువ ఉండ‌డంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల ఆనందాన్ని పెంచేందుకు ఆనందో బ్ర‌హ్మ అనే చిత్రంతో వ‌స్తుంది తాప్సీ. కామెడీ హ‌ర‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పాఠ‌శాల ఫేం మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

హారర్ కామెడీ

హారర్ కామెడీ

'భలే మంచి రోజు' సినిమాను ప్రొడ్యూస్ చేసిన టీమ్ ఇప్పుడు 'ఆనందో బ్రహ్మ' అంటూ పాఠశాల సినిమా ఫేం మహీ రాఘవ్ డైరక్షన్లో ఒక దెయ్యం కామెడీ రూపొందించారు. ఈ హారర్ కామెడీలో తాప్సీ ఒక చంద్రముఖ తరహా రోల్ చేస్తోందట. ఆల్రెడీ గంగ సినిమాలో అదే పాత్రలో నటించిన తాప్సీ.. ఇప్పుడు మరోసారి ఆ ఫీట్ రిపీట్ చేస్తోందనమాట.

మోషన్ పోస్టర్

మోషన్ పోస్టర్

ఆనందో బ్రహ్మ మోషన్ పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే రూపొందించారు. శ్రీనివాస్ రెడ్డి.. వెన్నెల కిషోర్.. రఘు.. షకలక శంకర్.. తదితర కామెడీ గ్యాంగ్ అంతా ఈ సినిమాలో మెయిన్ రోల్స్ చేస్తుండగా.. ఎర్ర చీర కట్టుకొని పన నవ్వుతూ చూస్తోంది డిల్లీ ఆపిల్ తాప్సీ విజ‌య్ చిల్ల మ‌రియు శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు.

ప్ర‌భాస్ చేతుల మీదుగా

ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన టీం తాజాగా ప్ర‌భాస్ చేతుల మీదుగా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి క‌థే హీరోగా ఉంటుంద‌ని తాప్సీ పేర్కొంది. మ‌రి ఆ మోష‌న్ పోస్ట‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.

English summary
Sharing the film's teaser, Prabhas said, "My friend Vijay and his team of 70mm Entertainments are coming up with a new kind of Comedy Horror titled "ANANDO BRAHMA". Best wishes to the entire team. Checkout for the motion poster".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X