»   »  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘వీరబలి’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘వీరబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన చిత్రం ‘రెబ‌ల్'. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ‘వీర‌బ‌లి' అనే టైటిల్ తో డ‌బ్ చేస్తున్నారు. కాంచ‌న‌, గంగ సినిమాల‌తో లారెన్స్ బాగా పాపుల‌ర్ అయ్యారు. బాహుబలి తర్వాత తమిళంలో ప్రభాస్ కు ఫాలోయింగ్ మరింత ఎక్కువయింది. ఈ నేపథ్యంలో ‘వీరబలి' మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు. తెలుగులో ‘రెబల్' ప్రభాస్ కెరీర్లోనే భారీ పరాజయం చవిచూసిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే..బాహుబలి తర్వాత ప్రభాస్ చుట్టూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతున్నారని, ఆయన త్వరలో ధూమ్-4లో నటించే అవకాశం ఉందనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాటు కరణ్ జోహార్ కూడా ప్రభాస్ తో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

Prabhas starrer Veerabali to release soon

ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి-2 సినిమా షూటింగుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 2015న మొదలు కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది చివరకల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి తప్ప ప్రభాస్ ఇప్పటి వరకు ఏ ఇతర ప్రాజెక్టులు కూడా అఫీషియల్ గా కమిట్ కాలేదు.

బాహుబలి పార్ట్ 2 కూడా భారీ విజయం సాధిస్తే ప్రభాస్ ఇక ప్రాంతీయ స్థాయిలో కాకుండా.... జాతీయ స్థాయిలో సినిమాలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ దేహ దారుఢ్యం, సూపర్బ్ లుక్స్, దక్షిణాదిలో ఫాలోయింగ్, బాహుబలి తర్వాత బాలీవుడ్లోనూ ఫాలోయింగ్, వీటన్నింటికీ మించి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ప్రభాస్ ప్లస్ పాయింట్స్. ప్రభాస్ ధూమ్-4 మూవీకి పర్ ఫెక్టుగా సెట్ అవుతాడని అంటున్నారు.

English summary
- Baahubali Star Prabhas starrer Veerabali to release soon in tamil nadu.
Please Wait while comments are loading...