»   » శ్రేయాస్ మీడియా ద్వారా ‘ప్రమాదం’

శ్రేయాస్ మీడియా ద్వారా ‘ప్రమాదం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి ప్రధానపాత్రల్లో అర్రా మూవీస్ బ్యానర్ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ప్రమాదం'. ప్రదీప్ దాస్, తపస్ జెనా దర్శకులుగా ప్రదీప్ కుమార్ అర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేయాస్ మీడియా విడుదల చేస్తుంది.

ఈ సందర్బంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత ప్రదీప్ కుమార్ అర్రా, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ పాల్గొన్నారు. గతంలో మేము ‘భద్రమ్' తరహా చిత్రాలను తెలుగులో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నాం. ప్రమాదం సినిమాని కూడా చూశాను. నాకు బాగా నచ్చడంతో ఈ సినిమాని మా శ్రేయాస్ మీడియా ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు.

ఈ నెల 26న తెలుగులో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని 75-100 థియేటర్స్ లో విడుదల చేయనున్నాం. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని డిఫరెంట్ హర్రర్ మూవీగా అందరినీ అలరిస్తుందని శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సినిమాలో పాటలు, కామెడి ఉండదు కేవలం హర్రర్ మాత్రమే ఉంటుంది. ఏడుగురు వ్యక్తులు చుట్టూ తిరిగే కథ. శ్రేయాస్ మీడియా ద్వారా ఈ సినిమాని తెలుగులోవిడుదల చేయడం ఆనందగం ఉంది. ఈ సినిమా జూన్ 26న విడుదలవుతుందని నిర్మాత ప్రదీప్ కుమార్ అర్రా అన్నారు.

English summary
Sambith,Yelli ,Mousami,Sneha starrer Pramadam 'Chavu 100%' movie is going to release very grandly on June 26 this film was directed by Tapas Jena ,Pradeep Das .Produced by Pradeep under Arra Movies banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu