»   » పవన్ కళ్యాణ్ కు ఎంత చెప్పినా....: ప్రణీత

పవన్ కళ్యాణ్ కు ఎంత చెప్పినా....: ప్రణీత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విజయోత్సవ వేడుక నగరంలోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ విడుదలకు ముందే పైరసీకి గురైన ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులను అభినందించారు. ఈకార్యక్రమానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నదియా., ప్రణీత, అలీతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణీత స్టేజీపై మాట్లాడింది.

ప్రణీత మాట్లాడుతూ... నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు ...ఫస్టాఫాల్ పవన్ సార్, త్రివిక్రమ్ సార్, బి.వియన్ ఎస్ ప్రసాద్ లకి నా తరుఫున పెద్ద ధాంక్స్. మీకు ఎలా ధాంక్స్ చెప్పాలో అర్దం కావటం లేదు. ధాంక్యూ సో మచ్. వెరీ బిగ్ ధాంక్స్ టు తెలుగు ఆడియన్స్. ఇంత కష్ట సిట్యువేషన్ లో ఇంత సపోర్ట్ చేసారు. అత్తారింటికి దారేదిని ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా అందరికీ ధాంక్స్. వారు నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. పవర్ స్టార్ కి ఎంత ధాంక్స్ చెప్పినా చాలు కాదు..ధాంక్యూ సో మచ్ సార్ అని ముగించింది.

అత్తారింటికి దారేది చిత్రం గురించి చెప్తూ... ''ఈ సినిమాతో నా ఎదురు చూపులు ఫలించాయి. నాకో బిగ్ హిట్ వచ్చింది. నేను నమ్మకంగా చెబుతున్న మాట ఇది. పవర్‌స్టార్ సినిమా అంటే నే మినిమమ్ గ్యారెంటీ. విడుదలైన వారానికే ఆయన సినిమాలు సక్సెస్ బార్డర్‌ని దాటేస్తుంటాయి. ఇక 'అత్తారింటికి దారేది' విషయానికొస్తే.. బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చింది'' ప్రణీత. చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ఇందులో బాపు బొమ్మలాంటి అందమైన పాత్ర చేశాను. కచ్చితంగా నాకు మంచి పేరు తెచ్చే పాత్ర ఇది. ఈ సినిమా విషయంలో నాకు ప్రమోషన్ లేకపోయినా ఫర్లేదు. 'అత్తారింటికి దారేది' హిట్టైంది కాబట్టి టాలీవుడ్ దర్శక, నిర్మాతలందరూ నా వెంటపడతారు అని ధీమా వ్యక్తం చేశారు ప్రణీత.

ఇక పవన్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ' గబ్బర్‌సింగ్-2' పనులు వేగవంతం చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రణీతని ఎంపిక చేసే అవకాసమున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవన్ తాజా చిత్రం అత్తారింటికి దారేదీలో ప్రణీత ఓ హీరోయిన్ గా చేయటం, తెలుగు అమ్మాయి కావాలన్న పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆమెను సంపత్ నంది ప్రపోజ్ చేసినట్లు చెప్తున్నారు. దాంతో బెంగుళూరు టైమ్స్ వారు ఆమెను ఈ విషయమై అడగటం జరిగింది. ఈ వార్తను ఆమె ఖండించింది. తనకు ' గబ్బర్‌సింగ్-2' ప్రపోజల్ రాలేదని చెప్పింది.

English summary
Pranitha thanks Pawan Kalayan at Atharintiki daredi Thank you Meet. Bangalore girl Pranitha will be only the second actress to star in a Pawan Kalyan film more than once. Pawan is known to repeat his heroines, so the news of Pranitha having been signed on to do Gabbar Singh 2 came as a bit of a surprise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu