For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆడేసుకుంటున్నారు: చైతు,శృతిలను వెటకారం చేస్తూ పోస్ట్ లు వరద,ఇవిగో అవి

  By Srikanya
  |

  హైదరాబాద్: నాగచైతన్య, శృతిహాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ప్రేమమ్. నిన్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేమమ్‌లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాసు ఆలపించారు.

  ఈ పాటకు మూలం మళయాళం లోని మలరే సాంగ్. దాంతో అందరూ ఈ పాటను, ఒరిజనల్ పాట ను పోల్చి చూసి, ఎక్సపెక్టేషన్స్ కు కొద్దిగా కూడా రీచ్ కాలేదంటూ వెటకారాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ పోస్ట్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మళయాళిలు ఈ పోస్ట్ లు ఎక్కువ పెడుతున్నారు. మళయాళి వెర్షన్ ఇక్కడ

  ఈ పాటను వారంతగా ఇష్టపడ్డారో మీకు ఈ క్రింద వారు చేస్తున్న ట్రోల్స్ చూస్తుంటే అర్దమవుతుంది. సాయి పల్లవి ని శృతి హాసన్ తో పోలుస్తూ నవీన్ పోలి...నాగచైతన్య ఎక్సప్రెషన్స్ కు షాక్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. క్లాస్ రూమ్ లో కూర్చుని, నాగచైతన్య చేసే సైగలకు నవ్వువస్తోందంటున్నారు.

  ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మళయాళ మూవీకి రీమేక్‌గా ప్రేమమ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ట్రోల్ చేస్తూ ఓ వీడియోని కూడా విడుదలచేసారు.దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

  మీరు చూడండి...వారేం ట్రోల్ చేసారో..

   చైతూ..

  చైతూ..

  నాగచైతన్య ఎక్సప్రెషన్స్ చూసి ఎలా షాక్ అవుతున్నారో చూడండి..

  విమర్శలు

  విమర్శలు

  ఇన్ని విమర్శలు వస్తాయని టీమ్ ఊహించి ఉండరు

  జాగ్రత్తలు

  జాగ్రత్తలు

  చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ పాటను తెరకెక్కించింది టీమ్

  అతి ప్రేమ

  అతి ప్రేమ

  మలారే పాటపై ఉన్న అతి ప్రేమే..ఈ ఎవరే సాంగ్ పై ద్వేషంగా మారిందంటున్నారు

  బిజినెస్ పై

  బిజినెస్ పై

  ఇలా ట్రోల్ అవటం ఖచ్చితంగా బిజినెస్ పై ప్రభావం చూపే ప్రతికూలాంసం

  ఫీల్ ను

  ఫీల్ ను

  సినిమాను ట్రాన్సలేట్ చేయవచ్చు కానీ పీల్ ని ట్రాన్సలేట్ చేయటం కష్టం అంటున్నారు

  సినిమాపైనా

  సినిమాపైనా

  రేపు ప్రేమమ్ తెలుగు వెర్షన్ రిలీజైతే ఖచ్చితంగా సినిమాని నిశిత దృష్టితో చూస్తారు మళయాళిలు

  తెలుగు వాళ్లు సైతం

  తెలుగు వాళ్లు సైతం

  చాలా మంది తెలుగువాళ్లు మల్టిఫ్లెక్స్ లలోనూ, టోరెంట్స్ ద్వారాను ప్రేమమ్ చిత్రం మళయాళి వెర్షన్ ఇప్పటికే చూసి ఉన్నారు

  ఇష్టపడి

  ఇష్టపడి

  నాగ చైతన్య ఈ చిత్రం చాలా ఇష్టపడి చేస్తున్నాని చాలా సార్లు చెప్పారు

  ఇదే సమయంలో

  ఇదే సమయంలో

  ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగచైతన్య ,సమంత ల లవ్ స్టోరి బయిటకు రావటం విశేషం

  రీమేక్ కావటంతో

  రీమేక్ కావటంతో

  ఈ సినిమా రీమేక్ కావటం,పెద్ద హిట్ కావటంతో తనకు బ్రేక్ వస్తుందని చైతూ భావిస్తున్నాడు

  చందు మొండేటి

  చందు మొండేటి

  తొలి చిత్రం కార్తికేయతో పేరు తెచ్చుకున్న చందు మొండేటి రెండో చిత్రం ఇది

  క్రేజ్

  క్రేజ్

  శృతి హాసన్ ను సినిమాలోకి తీసుకోవటం ప్రాజెక్టుకు క్రేజ్ తేవటానికే అనేది తెలిసిన విషయమే

  ఫ్రేమ్ టు ఫ్రేమ్

  ఫ్రేమ్ టు ఫ్రేమ్

  ఈ సినిమాలో పెద్ద మార్పులు చేయకుండా ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది

  గెటప్ లు అవే

  గెటప్ లు అవే

  మళయాళ వెర్షన్ లో ఉన్న గెటప్ లనే తెలుగు వెర్షన్ లోనూ ఫాలో అవుతున్నారు..హీరో గెడ్డం తో సహా

  లవ్ స్టోరీలు

  లవ్ స్టోరీలు

  హీరో ఈ చిత్రంలో మూడు లవ్ స్టోరీలను నడుపుతూ కనిపిస్తాడు

  ఆటోగ్రాఫ్ తరహా

  ఆటోగ్రాఫ్ తరహా

  ఈ చిత్రం ఇంతకు ముందు రవితేజ హీరోగా వచ్చిన ఆటోగ్రాఫ్ తరహాలో ఉంటుంది

  ఫీల్ గుడ్

  ఫీల్ గుడ్

  సినిమా పూర్తిగా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా నడుస్తుంది, ఫీల్ వర్కవుట్ అయితే పెద్ద హిట్టే

  లవ్ స్టోరీలు

  లవ్ స్టోరీలు

  చైతుకు ఈ సినిమా వర్కవుట్ అయితే వరస పెట్టి లవ్ స్టోరీలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు

  ఏమి మాయ చేసావే

  ఏమి మాయ చేసావే

  గతంలో చైతు చేసిన ఏమి మాయ చేసావే చిత్రం తరహాలో మ్యాజిక్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

  English summary
  Guess the 'Malar' fans are not happy with 'Evare', the Telugu version of the 'Premam' song. The Facebook buffs have been trashing it, ever since the video of the Telugu song released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X