»   » అసలేముంది? ‘ప్రేమమ్’లో.... (ఒరిజినల్ వెర్షన్ రివ్యూ)

అసలేముంది? ‘ప్రేమమ్’లో.... (ఒరిజినల్ వెర్షన్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలంలో సూపర్ హిట్టయిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చైతూ కెరీర్లో 12వ సినిమా ఇది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని 'ప్రేమమ్' పేరుతోనే రీమేక్ చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ యూనిక్ గా ఉండటమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒరిజినల్ వెర్షన్ ప్రేమమ్ చిత్రంలో నటించిన వారే. మళయాలం ప్రేమంలో లెక్చరర్ పాత్ర పోషించి సాయి పల్లవి స్థానంలో శృతి హాసన్ నటిస్తోంది. సినిమాలో హృతి హాసన్ రోల్ కీలకంగా, ఎక్కువగా నిడివితో ఉంటుంది. మిగతా ఇద్దరివీ పరిమితమైన పాత్రలే.


మళయాలం చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్టయిన ప్రేమమ్ మూవీలో ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయి? అనేది తెలియంటే మళయాలం వెర్షన్ రివ్యూ చదవాల్సిందే. రివ్యూ చదివేందుకు క్రింది లింక్ క్లిక్ చేయండి..


'ప్రేమమ్' ఒరిజినల్ వెర్షన్ రివ్యూ....


Premam original version review

ఒరిజినల్ వెర్షన్లో హీరో కొన్ని సీన్లలో గడ్డంతో కనిపిస్తాడు. ఇందులో నాగ చైతన్య కూడా అదే లుక్ తో కనిపించబోతున్నారు. ప్రేమంలో... సాయి పల్లవి లెక్చరర్ పాత్రలో చీరకట్టులో డీసెంటుగా కనిపిస్తుంది. తెలుగు వెర్షన్లో కూడా శృతి హాసన్ అదే లుక్ తో కనిపించబోతోంది.


Premam original version review

'ప్రేమమ్' మళయాలం సినిమా అయినప్పటికీ తమిళం, తెలుగు, కన్నడ యూత్ ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూసేసారు. బాషతో సంబంధం లేకుండా సినిమా అందరికీ అర్థం అయ్యేలా మంచి ఫీల్ తో ఉండటమే అందుకు కారణం. సినిమాలో నవీన్ పాలీ పెర్ఫార్మెన్స్ హైలెట్..... తెలుగులో నాగ చైత్య కూడా అదే రేంజిలో చేస్తే సినిమా హిట్టవడం ఖాయం.

English summary
Check out Premam movie original version review. Now The Malayalam blockbusters is being remade in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X