»   »  విభిన్నమైన కథ దొరికింది: శరణం గచ్చామిపై దర్శకుడు ప్రేమరాజ్

విభిన్నమైన కథ దొరికింది: శరణం గచ్చామిపై దర్శకుడు ప్రేమరాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హదైరాబాద్: నవీన్ సంజయ్, తనిష్ తివారి, తన్వి మల్హర్ ముఖ్య పాత్రలో ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న ‘శరణం గచ్చామి' చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు.

Premraj's Sharam Gatchaami shooting begins

బొమ్మకు లక్ష్మి నరసమ్మ స్విచ్ ఆన్ చేయగా సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రేమరాజ్ తమ శిష్యుడని, విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడని, ఈ సినిమా తప్పకుండా సూపర్‌హిట్ అవుతుందని ఆయన అన్నారు.

Premraj's Sharam Gatchaami shooting begins

దర్శకుడు ప్రేమరాజ్ మాట్లాడుతూ రెండు విభిన్నమైన సినిమాలను రూపొందించిన తనకు మూడో సినిమాకు విభిన్నమైన కథ దొరికిందని, మూస పద్ధతిలో వచ్చే సినిమాలకు వైవిధ్యంగా సాగుతుందని, సమస్యను చర్చిస్తూనే కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమా పూర్తిచేస్తామని ఆయన అన్నారు.

English summary
Sharanam Gatchaami film shooting has begun under the direction Premaraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu