»   »  మహేష్ బాబును వాడుకుంటున్న ప్రియమణి!

మహేష్ బాబును వాడుకుంటున్న ప్రియమణి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లోని సీన్లను, డైలాగులను, పాటలను వాడుకోవడం ఈ మధ్య కామన్ అయింది. తాజాగా 'చండీ' చిత్రంలో మహేష్ బాబు 'అతడు' చిత్రంలోని డైలాగును ఉన్నదున్నట్లు వాడేసారు.

తాజాగా విడుదలైన చండీ టీజర్లో 'సముద్రాన్ని చూడాలనుకో తప్పు లేదు...కానీ సునామీని చూడాలనుకోకు చచ్చిపోతావ్' అంటూ ప్రియమణి డైలాగ్ ఇరగదీసింది. ఇది బాగా పాపులర్ అయిన డైలాగు కావడంతో మహేష్ బాబు సినిమా డైలాగని ఇట్టే పసిగట్టేస్తున్నారు ప్రేక్షకులు. అయితే మరి ఈ డైలాగు కావాలని పెట్టారో? కాకతాళీయంగా జరిగిందో తెలియాల్సి ఉంది.

ఇక చండీ సినిమా వివరాల్లోకి వెళితే...ప్రియమణి టైటిల్‌ పాత్రలో కృష్ణంరాజు ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'చండీ'. 'వి.సముద్ర' దర్శకత్వంలో 'ఒమిక్స్ క్రియేషన్స్' పతాకంపై జి.జగన్నాథనాయుడు సమర్పణలో డాక్టర్‌ శీనుబాబు నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు వి.సముద్ర.. 'అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాలన్న కృష్ణంరాజు ఆశయం మా చిత్రం ద్వారా నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఇద్దరు మాస్‌ నటులైన కృష్ణంరాజు, శరత్‌కుమార్‌ల అభినయం మధ్య కథానాయిక నిలబడటమంటే మాటలుకాదు. ప్రియమణి ఆ పోటీని కూడా తట్టుకుని తన పాత్రకు న్యాయం చేసింది' అని అన్నారు.

నిర్మాత శీనుబాబు.. 'రెండు పెద్ద సినిమాల అనంతరం విడుదల చేద్దామనే వేచి చూశాం. యాక్షన్‌, మంచి మెసేజ్ ఇంచే చిత్రంగా 'చండీ' నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలా జీవించాలో అన్న అంశాన్ని ఇందులో ఆవిష్కరించాం'అని అన్నారు. మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చేంతంగా ఈ చిత్రముంటుందని సహ నిర్మాత సత్య ముమ్మిడి తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి. బాబ్జీ, ఛాయాగ్రహణం: వాసు, సంగీతం: ఎస్‌ఆర్‌ శంకర్‌, చిన్నా అందించారు.

English summary
Priyamani's upcoming film Chandi has a Mahesh's 'Athadu' dialogue retold by herself. Here goes that dialogue: "Samudraanni choodalanuko tappuledu kaani tsunami choodalani anukoku chachchipotaav" is the rehashed dialogue from her upcoming heroine-centric movie 'Chandi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu