»   » తండ్రీ,కొడుకులకు భార్యగా...ఆ హీరోయిన్

తండ్రీ,కొడుకులకు భార్యగా...ఆ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకే చిత్రంలో తండ్రీకొ డుకులకు భార్యగా నటిస్తూ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా సంచలనం సృష్టిస్తోంది. సాత్‌ ఖూన్‌ మాఫ్‌" అనే చిత్రంలో ఈ విచిత్రం చోటుచేసుకుంటోంది. 'సెవెన్‌ హజ్బెండ్స్‌" అనే హాలీవుడ్ చిత్రం ఆదారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్‌ భరద్వాజ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకచోప్రాకు ముసలి భర్తగా నసీరుద్దీన్ ‌షా నటిస్తుండగా..పడుచు భర్తగా నసీరుద్దీన్‌షా తనయుడు వివన్‌ నటించనుండడం విశేషం. ఇది వివన్‌కు ప్రారంభ చిత్రం కానుండడం మరో విశేషం. ఇక ఇలా తండ్రి కొడుకులకు ఒక్కరినే హీరోయిన్ గా చూపెడితే ప్రేక్షకులు అంగీకరించరేమోనంటూ యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల్ని విశాల్‌ భరద్వాజ్‌ కొట్టిపారేస్తున్నారు. ఇక విశాల్ భరధ్వాజ్ కమీనే, ఇష్కియాలు విభిన్న చిత్రాలుగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇక సాత్‌ ఖూన్‌ మాఫ్‌"లో కథ ప్రకారం పైకి అందంగా, అమాయకంగా కనిపించే ప్రియాంక తను పెళ్ళి చేసుకున్న ఏడుగురు భర్తలను వరసగా చంపేస్తుంది. అయితే వారిని వరుసగా ఎందుకు హత్య చేస్తుందనేది ప్రస్తుతానికి రహస్యం అని దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ అంటున్నారు. ఇక ఈ చిత్రంలోనే ప్రియాంకకి ఏడుగురు భర్తలుగా ఎవరు నటిస్తున్నారనే విషయానికొస్తే..జాన్‌ అబ్రహాం, మోహన్‌లాల్‌, నసీరుద్దీన్‌ షా, అర్షద్‌ వార్సి, వివన్ ఇప్పటివరకు ఈ ఐదుగురూ ఎంపికయ్యారు. ఆరో భర్తగా ఇర్పాన్‌ ఖాన్‌ని ఎన్నుకోవాలని విశాల్‌ భరద్వాజ్‌ అనుకుంటున్నారు. ఒక భర్తగా విదేశీయుడు నటించబోతున్నారని సమాచారం. ఇక మిగిలిన ఒకే ఒక్క భర్త పాత్రకి మాత్రం ఇంకా ఎవరూ ఖరారు కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu