For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పృథ్వీరాజ్ సెక్స్ అంటా.. ఆమెను గోకాడు అంటా.. ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ

  |

  సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకొన్న పృథ్వీరాజ్ తనకంటూ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. ఇప్పటికీ తనదైన శైలిలో కామెడీని పండించడంలో ఆయనకు ఎవరూ సాటి రారు. యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తూనే రాజకీయాల్లో తన వంతు ప్రభావం చూపించారు. అయితే ఓ చిన్న వివాదం, ఆరోపణల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తనపై వస్తున్న ట్రోలింగ్స్‌ గురించి తాజాగా మాట్లాడుతూ..

  పవన్ కల్యాణ్ గురించి...

  పవన్ కల్యాణ్ గురించి...

  రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించడం తప్పు కాదు. పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఉంటూ నటించడంలో నాకు తప్పేమీ కనిపించడం లేదు. ప్రతీ మనిషికి వృత్తి, ప్రవృత్తి అనేవి ఉంటాయి. వృత్తిని కొనసాగించాలి. ప్రవృత్తిని ముందుకు తీసుకెళ్లాలి. దాని వల్ల ఎవరికీ నష్టలేనప్పుడు దానిని ఎందుకు వ్యతిరేకించాలి. పవన్ కల్యాణ్‌ను ఏ పార్టీ వాళ్లైనా సరే ట్రోలింగ్ చేయకూడదని పృథ్వీరాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  ట్రోలింగ్స్ పట్టించుకోను అంటూ

  ట్రోలింగ్స్ పట్టించుకోను అంటూ

  ట్రోలింగ్ అంటే ఫృథ్వీరాజ్. నన్ను టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతుంటారు. అయినా నేను ఏమీ పట్టించుకోను. నేను పెద్దగా చూడను. నాకు సంబంధించిన వాళ్లు చూసి, ఫ్రెండ్స్ చూసి లింకులు షేర్ చేస్తుంటారు. వాళ్లకు ఒకటే మాట చెబుతుంటాను. కరోనా కాలం... వాళ్లేదో చేసుకొంటూ హ్యపీగా ఉంటున్నారు. వాళ్లనైనా సంతోషంగా ఉండనివ్వండి అంటూ ట్రోలింగ్స్‌ గురించి చాలా తేలికగా తీసుకొన్నారు.

  పనీపాట లేని వాళ్లు నాపై పడి

  పనీపాట లేని వాళ్లు నాపై పడి

  సోషల్ మీడియాలో పనీపాట లేని కొందరు నాపై అనవసరంగా నోరు పారేసుకొంటారు. కారణం లేకుండా నాపై పడి ఏడవడం ఎందుకురా వెధవల్లారా అంటూ ఫృథ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని వెధవలకు నన్ను టార్గెట్ ఎందుకు చేస్తారో అర్దం కాదు. ఎటుపడి నన్ను తిట్టాలని టార్గెట్ చేసుకొంటారు. ఇప్పుడు చాలా మంది పృథ్వీరాజ్‌ది తప్పు లేదని అంటున్నారు అని ఫృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

  ఎవరినో గోకారంటూ..

  ఎవరినో గోకారంటూ..

  ఫృథ్వీరాజ్‌ సెక్స్ అంటా.. పృథ్వీరాజ్‌ ఎవరినో గోకారంటా అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలా నా మీద కామెంట్లు చేయడం వల్ల నాకు ఏమీ నష్టం జరగలేదు. నా చుట్టు ఉన్నవాళ్లంతా ఎగిరిపోయారు. వారికి నష్టం జరిగింది అంటూ ఫృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల తనకు ఏమీ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.

  పదవి, జీవితం శాశ్వతం కాదు అంటూ

  పదవి, జీవితం శాశ్వతం కాదు అంటూ

  రాజకీయాల్లోను, ప్రజా జీవితంలోను ఏదీ శాశ్వతం కాదు. పదవి శాశ్వతం కాదు. జీవితం శాశ్వతం కాదు. ప్రతీ పదేళ్లకు ట్రెండ్ మారుతుంటుంది. ఏదీ కాబట్టి.. హోదాలు, పదవులు శాశ్వతం కాదు. ప్రజలకు సేవ చేయడమే ప్రథమార్థం. ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని కల్పించడానికి ప్రతీ ఒక్కరు పాటుపాడాలి అంటూ పృథ్వీరాజ్ చెప్పారు.

   సినిమా కెరీర్‌పై ఫోకస్

  సినిమా కెరీర్‌పై ఫోకస్

  టీటీడీలో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమా కెరీర్‌పై ఫోకస్ చేస్తూనే ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనావైరస్ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో తన హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకొని సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే మరిన్ని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

  English summary
  30 Years Industry fame Prudhvi Raj reacted on trollings on Socail media. He was serious on abuse, trolling on Pawan Kalyan and Lokesh in Social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X