twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బ్రహ్మోత్సవం' ఫ్లాఫ్ కు అసలు కారణం రివీల్ చేసిన నిర్మాత

    By Srikanya
    |

    హైదరాబాద్ :మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం మూవీ మీద అందరూ ఎంతో హోప్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న అంచనాలకు ఆ సినిమా చేరలేకపోయింది. మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ డిజాస్టర్ టాక్ కు కారణం ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెప్పుకున్నారు. మీడియాలో ప్రచారం సైతం జరిగింది. అయితే ఈ విషయమై నిర్మాత పొట్లూరి వరప్రసాద్ రివీల్ చేసారు.

    నిర్మాత పివిపి మాట్లాడుతూ...షూటింగ్ కు ముందే రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసి, ఆ రిలీజ్ డేట్ కోసం ఆదరాబాదరాగా ఫస్ట్ కాపి కూడా చూడకుండా రిలీజ్ చేయటమే కారణం అన్నారు. బ్రహ్మోత్సవం కు అదే జరిగిందన్నారు. రిలీజ్ కు బాగా దగ్గరగా ఫస్ట్ కాపి వచ్చింది. దాంతో ఫస్ట్ కాపి చూడకుండా , ఏమీ మార్పులు చెయ్యకుండా రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది.

    PVP Revealed Reason behind Brahmotsavam flop

    అదే అమీర్ ఖాన్ చిత్రం దంగల్ విషయానికి వస్తే...రిలీజ్ తేది మూడు నెలలు ముందుగా సినిమా షూటింగ్ పూర్తైంది. తాందో అమీర్ తన ఇండస్ట్రీ స్నేహితులకు చూపెట్టి ఎన్నో మార్పులు చేస్తున్నారు. తెలుగు చిత్రాలకు అది కుదరటం లేదు. అయితే తాము ఇలాంటి పొరపాటు తమ బ్యానర్ లో రిపీట్ కాకుండా చూసుకుంటామని అన్నారు.

    ఏడు కొండలవాడా... ( 'బ్రహ్మోత్సవం' రివ్యూ)

    ఇక బ్రహ్మోత్సవం మహేష్ బాబుకు ఆశించిన ఫలితాన్నివ్వకుండా నిరాశ పరిచింది. అయినా సూపర్ స్టార్ నిరాశపడకుండా వెంటనే మరో మూవీకి షిప్ట్ అయ్యారు. తమిళ డైరెక్టర్ మురుగదాస్ తో మూవీ చేయాలని మహేష్ అంతకు ముందే... అంటే బ్రహ్మోత్సవం మేకింగ్ టైం లోనే డిసైడ్ అయ్యాడు.

    సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కొత్త రకం కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు.

    ఇక ఈ షెడ్యూల్ తరువాత వేరే ప్రాంతాలలో కొన్ని క్రూషియల్ సీన్స్ తెరకెక్కించనున్నట్టు సమాచారం. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని జనవరి చివరి వారం వరకు కంప్లీట్ చేయాలని మురుగదాస్ భావిస్తున్నాడు.

    ఇటీవల ఈ చిత్రానికి 'అభిమన్యుడు' అనే టైటిల్ ని పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. కాని తాజాగా మహేష్ రేంజ్ కి తగ్గట్టు 'ఏజెంట్ శివ' అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలనే ఆలోచనలో టీం ఉందని కోలీవుడ్ సమాచారం. అయితే మురుగదాస్ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ టైటిల్‌ని ఎనౌన్స్ చేసి చిత్రానికి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కోలీవుడ్ టాక్.

    దర్శకుడు ఎస్‌జె సూర్య ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోండగా, గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 28, 2017న ఈ చిత్రం థియేటర్లలోకి రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    English summary
    PVP who are one of the producers for this movie also expressed their dissatisfaction towards Brahmotsavam movie result. Sharing about this, in latest interview, PVP said that Brahmotsavam is one of the movies that he got more depressed and learned many lessons from that bad experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X