»   » ఆర్.నారాయణమూర్తిని పార్క్ లో ఓ అమ్మాయి కౌగలించుకోబోతే..ఆపి

ఆర్.నారాయణమూర్తిని పార్క్ లో ఓ అమ్మాయి కౌగలించుకోబోతే..ఆపి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : 'ప్రజల్ని మోసగిస్తూ, పేదోడిలా నటిస్తున్న నారాయణమూర్తి' అని హెడ్‌లైన్స్ పెట్టి రాయండి. నేను చెప్పినది కరెక్టని భావిస్తే, 'ఎలా చెబుతున్నాడో అలానే బతుకు తున్న ఆర్. నారాయణమూర్తికి సెల్యూట్' అని రాయండి అంటూ ఎమోషనల్ గా స్పందించారు ఆర్. నారాయణ మూర్తి.

  ఈ మాటలుఎప్పుడు అన్నారు అంటే..ఆయన్ని...ఊళ్లో బంగ్లా, స్థలాలు కొన్నారని విమర్శ. దానికేమంటారు? అని మీడియావారు ప్రశ్నించినప్పుడు. ఆయనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టే..ఇప్పటికీ అలా ధైర్యంగా మాట్లాడుగలుగుతున్నారు.

  'అర్ధరాత్రి స్వతంత్రం'తో హీరోగా మొదలై, ఇప్పటికి 30 ఏళ్లయింది సందర్బంగా ఆయన తెలుగులో ఓ లీడింగ్ న్యూస్ పేపరుకు ఇంటర్వూ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారు... ఏ విషయమై ఎలా స్పందించారో తెలియాలంటే క్రింద అందిస్తున్నాం చదవండి. ఈ క్రింద మ్యాటర్ మొత్తం ఆర్. నారాయణ స్వయంగా చెప్పినవే...

  బంగ్లా కట్టించానేమో చూడండి

  బంగ్లా కట్టించానేమో చూడండి

  ఓసారి మా ఊరు వెళ్లండి. నేను చేసిన మంచి పనులు కనిపిస్తాయి. ఆస్పత్రి కట్టించా. విద్యాలయాలకు డొనేట్ చేశా. పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. ఆంధ్ర, తెలంగా ణాల్లో బోర్లు వేయించా. కానీ ఎక్కడా చెప్పుకోను. మీర న్నట్లు మా ఊళ్లో నా సంపాదన ఉందనుకుంటే.. బంగ్లా కట్టించానేమో చూడండి అన్నారు.

  దొంగ చాటు వ్యాపారాలు చెయ్యలేదు

  దొంగ చాటు వ్యాపారాలు చెయ్యలేదు

  మా అమ్మా నాన్న ఏ ఇంట్లో ఉన్నారో చూడండి. రీసెంట్‌గా మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకతే ఉంది. ఊళ్లో నాకు ఎకరం స్థలం లేదు. థియేటర్లు లేవు. దొంగచాటు వ్యాపారాలేవీ చేయట్లేదు. ఒకవేళ మీరన్నది నిజమైతే ఇక నన్ను ఇంటర్వ్యూ చేయొద్దు అని నారాయణ మూర్తి అన్నారు.

   ఆర్. నారాయణమూర్తి సంపాదన ఇదీ

  ఆర్. నారాయణమూర్తి సంపాదన ఇదీ

  30 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సమస్యలే నా సినిమాలు. కార్మిక, ఆదివాసీ, దళితుల, స్త్రీ, రైతు, భూ పోరాటం.. ఇలా ఎన్నో విషయాలపై సినిమాలు తీస్తున్నా. పోగొట్టుకున్నది ఏం ఉంటుంది? ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నా కాబట్టి, అభిమానం సంపాదించుకున్నా. 30 ఏళ్లయ్యాయని గుర్తు పెట్టుకుని, ఇంటర్వ్యూ కోసం మీడియా వచ్చిందంటే, అది నేను సంపాదించుకున్నదే.

  మార్పు కోసం నా ఫైట్

  మార్పు కోసం నా ఫైట్

  సమస్యల్ని చూపిస్తే మార్పు అనేది వస్తుంది. సమాజం గ్యారంటీగా మారుతుంది. మార్పు కోసం డాక్టర్, సైంటిస్ట్, కార్టూనిస్ట్, పొలిటిషీయన్, మీ జర్నలిస్టులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో పోరు చేస్తారు. కళాకారుడిగా నేను నా సినిమాల ద్వారా మార్పు కోసం ఫైట్ చేస్తున్నా. నా 'అర్ధరాత్రి స్వతంత్రం' చూసి ఎందరో ఉద్యమబాట పట్టారు. 'ఎర్రసైన్యం' చూసి భూపోరాటం చేశారు. 'దండోరా' చూసి సారాకొట్లు బద్దలు కొట్టారు. అది మంచి మార్పేగా అన్నారు.

  వాళ్లంతా పోరాటం చెయ్యబట్టే కదా

  వాళ్లంతా పోరాటం చెయ్యబట్టే కదా

  గాంధీ 'శాంతి' అంటే నావి పోరాటం వైపు మళ్లిస్తున్నాయంటే పొరపాటు. ఒక్క గాంధీ వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదుగా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పోరాటం చేయమన్నారు కదా. ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రం.

  అంతా మలినం ..అందుకే

  అంతా మలినం ..అందుకే

  ఓ విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అభివృద్ధి పేరు చెప్పి, ఇండస్ట్రియలైజేషన్ చేసేస్తున్నారు. అంతా మలినం. రొయ్యల వ్యాపారానికి గండిపడింది. పర్యావరణం నాశనం. భూములు లేకుండా పోయాయి. రైతుల పరిస్థితేంటి? ఉద్యమాలు చెయ్యాలా? వద్దా? చేసినా పోలీసులు కొడుతుంటే తిరుగుబాటు చేయరా? చేయకపోతే ఆ వాయిస్ ఎలా తెలుస్తుంది?

  ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చి..

  ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చి..

  'అర్ధరాత్రి స్వతంత్రం' నుంచి 'వేగు చుక్కలు' వరకూ 20 ఏళ్లపాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. అది చూసి కొంతమంది ఇలాం టివి తీశారు. ఒకటీ రెండు తీశాక మొనాటనీ వచ్చిందని మానేశారు. నేను మాత్రం తీస్తూనే ఉన్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి సక్సెసవుతున్నా. మొదట్నుంచీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్, డెరైక్షన్, మ్యూజిక్ - అంతా నేనే కాబట్టి, బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. సినిమా రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. 'ఆల్ వైట్.. నో బ్లాక్' అని చెప్పారు.

  నో మొనాటినీ

  నో మొనాటినీ

  నా బతుకు ఇంతేనా? మార్పు లేదా? అనే ఆలోచన ఏ మనిషి మనసులోనైనా వస్తే, అతడికి విసుగొస్తుంది. అప్పుడు ముందుకు సాగలేడు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా తల్లిపై ఉన్న అభిమానం, ఆరాధన, ఇష్టం, గౌరవం తగ్గలేదు. సినిమాలపై అయిష్టం రాలేదు.

  నా లైఫ్ స్టైల్ ఇదే

  నా లైఫ్ స్టైల్ ఇదే

  సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్‌లో కూడా నాకు రెండు జతల బట్టలే. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం.

  కౌగలించుకోబోయింది

  కౌగలించుకోబోయింది

  ఓసారి హైదరాబాద్‌లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో నడుస్తుంటే.. ఓ అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే, 'హగ్ కల్చర్' అట. 'నీది ఏ దేశం?' అనడిగా. హైదరాబాదే అని చెప్పింది. ఈ హగ్ కల్చర్, ముద్దులు, ఇవన్నీ మనకు కాదు, యూరోపియన్లకు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే ఎంత భ్రష్టు పడుతుంది. చిన్నపిల్లలతో టీవీల్లో డ్యాన్సులు ఏంటమ్మా? పసిపిల్లలకేం తెలుసు? చివరికి వాళ్లు ఈ సంస్కృతికి అలవాటు పడతారు.

  రెండు పడవల ప్రయాణం వద్దు

  రెండు పడవల ప్రయాణం వద్దు

  కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ పిలిచింది. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళితే.. సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడు మనకిచ్చిన వరంగా ఫీలవ్వాలి. ఓ కాలు సినిమా పడవపై, మరో కాలు రాజకీయమనే పడవపై వేసి ప్రయాణించలేను.

  యాక్టింగ్ పిచ్చితోనే

  యాక్టింగ్ పిచ్చితోనే

  ఇప్పుడు బయటి బేనర్‌లో 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా చేస్తున్నా . బయట సినిమా చేయడానికి కారణం? యాక్టర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనే. యాక్టింగ్ పిచ్చితో మద్రాస్ వెళ్లినోణ్ణి. గతంలో పలువురు మిత్రులు మంచి వేషాలు ఆఫర్ చేశారు. కానీ, మొనాటనీ ఉంటే జనాలు సినిమా చూడడం మానేస్తారు. అది బ్రేక్ చేస్తూ డిఫరెంట్ వేషాలు వేయాలనుంది. ఇప్పటి వరకూ ఉద్యమకారుడు, రైతు, కార్మికుడు, నిరుద్యోగి, రిక్షావోడు, దళితుడు - ఇలా అనేక వేషాలు వేశా. ఇప్పుడు కానిస్టేబుల్, ప్యూన్, జవాను, గుమస్తా, బక్కరైతు, కులవృత్తులకు సంబంధించిన హీరో పాత్రలు చేయాలనుంది అన్నారు.

  నా అర్హత, అనర్హతలు తెలుసు

  నా అర్హత, అనర్హతలు తెలుసు

  దేవుడి దయ వల్ల ఆర్.నారాయణ మూర్తి అనే మార్క్ వచ్చింది. ముసలోణ్ణి అయినా 'త్రిశూల్'లో దిలీప్‌కుమార్, 'శంకరాభరణం'లో సోమయాజులుగారి తరహాలో నటిస్తా. ఏ మనిషికైనా తన అర్హత, అనర్హతలు ఏంటో ఇతరుల కంటే తనకే బాగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో మహా అయితే మరో నాలుగైదేళ్లు ఉంటా. అప్పటివరకూ నటిస్తా. 'నా రాజ్యానికి నేనే రాజు' అనేది నా పాలసీ అన్నారు.

  దయనీయంగా ఉంది

  దయనీయంగా ఉంది

  నాకు బ్లాక్ అండ్ వైట్ తేడా తెలియదు. నల్లధనం ఉండకూడదనే ఆశయంతో మోదీగారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కానీ, మోదీగారిని నేనేం ప్రశ్నిస్తున్నానంటే... ఎన్నికలకు ముందు విదేశీ బాం్యకుల్లో ఉన్న నల్ల డబ్బుని జనానికి పంచేస్తానన్నారు కదా. ముందా పని చేయమంటున్నా. ఎందుకు చేయలేకపోయారు? 500, 1000 రూపాయిల నోటుని రద్దు చేసినప్పుడు 2000 రూపాయి నోటు ఎందుకు? మోదీ హఠాత్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులపాలు చేస్తోంది. లోయర్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉంది అని తేల్చి చెప్పారు నారాయణ మూర్తి.

  English summary
  Senior actor R Narayana Murthy who is popular for movies with left orientation has a reason for regret. Narayanamurthy who acts in, directs and produces his own movies leads a pretty ordinary lifestyle in Hyderabad. He is famous for his blockbusters Erra Sainyam, Orey Rikshaa.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more