»   » లవ్ ఎఫైర్: హీరో ఆత్మహత్యా యత్నం, నిజాలు బయట పెట్టిన హీరోయిన్!

లవ్ ఎఫైర్: హీరో ఆత్మహత్యా యత్నం, నిజాలు బయట పెట్టిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ హీరో హుచ్చా వెంకట్ ఆదివారం ఫినాయిల్ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసే ముందు మీడియాకు సమాచారం ఇచ్చి మరీ హైడ్రామా క్రియేట్ చేశాడు.

తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందనే కారణంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు హుచ్చా వెంకట్ వెల్లడించారు. సూపర్ జోడీ రియాల్టీషోలో తనతో నటిస్తున్న రచన, తాను ప్రేమించుకున్నామని... అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని, వారికి భయపడి ఆమె కూడా పెళ్లికి నిరాకరిస్తోందంటూ హుచ్చ వెంకట్ మీడియాకు తెలిపారు.

నిజాలు బయట పెట్టిన రచన

నిజాలు బయట పెట్టిన రచన

అయితే హెచ్చ వెంకట్ ఆరోపణలను రచన ఖండించింది. తాను వెంకట్ ను ప్రేమించడం లేదని తేల్చి చెప్పింది. తనకు ఇష్టం లేకున్నా కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నాడని ఆమె అన్నారు.

ఆత్మహత్యాయత్నంతో సంబంధం లేదు

ఆత్మహత్యాయత్నంతో సంబంధం లేదు

నేను హుచ్చా వెంకట్ ను ప్రేమించడం లేదు. అతడి ఆత్మహత్యాయత్నానికి, తనకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను అనసవరంగా బ్లేమ్ చేస్తున్నాడు అని రచన వాపోయారు.

పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు

పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు

అతడే... తనను కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడని, తాను వద్దన్న వినకుండా వెంట పడుతున్నాడని రచన తెలిపారు. నేను అతడిని ప్రేమిస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదన్నారు.

బెదిరింపులు

బెదిరింపులు

పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కొంతకాలంగా హుచ్చ వెంకట్ ఆమెను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆదివారం మీడియాతో పాటు రచనకు... ప్రేమ విఫలమై తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను హడావుడి చేశాడు.

సూపర్ జోడి సమయంలోనే ప్రపోజల్

సూపర్ జోడి సమయంలోనే ప్రపోజల్

సూపర్ జోడి రియాల్టీ షో ప్రారంభమైన కొత్తలో అంతా భాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు తనను ఇష్టపడుతున్నాడని అర్థమైంది. ఓసారి నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. కానీ నేను నిరాకరించాను. అప్పటి నుండి పెళ్లి చేసుకోవాలని నా వెంట పడుతూనే ఉన్నాడని రచన తెలిపారు.

English summary
Huchcha Venkat is being treated in hospital as he attempted suicide yesterday, June 19. Asked why, Venkat has said that he had committed the heinous crime because his love did not agree to marry him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu