»   » మా అమ్మ పేరుతో నన్ను పిలవండి, ఆయన దేవుడు..... లారెన్స్ అద్బుతంగా చెప్పాడు

మా అమ్మ పేరుతో నన్ను పిలవండి, ఆయన దేవుడు..... లారెన్స్ అద్బుతంగా చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్, మెగాస్టార్, నాచురల్ స్టార్, డాన్సింగ్ స్టార్, ఇలా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రతీ "వుడ్" లోనూ ఈ బిరుదులు కామన్. ప్రతీ ఫాలోయింగ్ ఉన్న హీరోకీ ఒక "స్టార్" స్టేటస్ ఇచ్చేయటం మనోళ్ళకి అలవాటు. కొన్నాళ్ళపాటు శ్రీకాంత్ నికూడా మైటీ స్టార్ అనేవాళ్ళు, ఆఖరికి సంపూర్ణేష్ బాబు ని కూడా బర్నింగ్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. ఇక పీపుల్స్ స్టార్ అని అన్న నారాయణ మూర్తినీ పిలుచుకుంటున్నాం.... అయితే ఇప్పుడు ఈ స్టార్ వివాదం కోలీవుడ్ లో చిన్నసైజు కలకలం రేపింది అయితే దాన్ని ఎంతో వినమ్రంగా సమాధానపరిచి, సద్దుమనిగేలా చేసాడు రాఘవ లారెన్స్. ఇంతకీ ఏంజరిగిందీ అంటే...

మొట్టశివ కెట్టశివ

మొట్టశివ కెట్టశివ

తెలుగులో కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన "పటాస్" మూవీ తమిళ్ లో ‘మొట్టశివ కెట్టశివ' పేరుతో లారెన్స్ హీరోగా రీమేక్ చేసారు. అయితే అనుకోని కారనాలూ, బడ్జెట్ ఇబ్బందులూ దాటుకొమ్ని దాటుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తేదీ (మార్చి 10) కంటే ఒకరోజు ముందుగానే విడుదల చేసిన ఈ చిత్రానికి మాస్‌ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇక్కడే చిన్న తేడావచ్చింది.

మక్కల్‌ సూపర్‌స్టార్‌

మక్కల్‌ సూపర్‌స్టార్‌

సినిమా టైటిల్స్‌లో ‘మక్కల్‌ సూపర్‌స్టార్‌' లారెన్స్ అని వేయడం ఇండస్ర్టీలో టాపిక్‌గా మారింది. మక్కల్ అంటే ప్రజలు అనే అర్థం ఉంది ఈ మధ్య జల్లికట్టులో యాక్తివ్ గా పాల్గొనట్అం వల్ల ప్రజలమనిషి అనీ అర్థం వచ్చేలా మక్కళ్ సూపర్‌స్టార్‌ అని వేసారు. అయితే అదే ఇప్పుడు సమస్య అయి కూచుం

రజనీకాంత్‌కు మాత్రమే

రజనీకాంత్‌కు మాత్రమే

సూపర్‌స్టార్‌ అనే బిరుదుని ఇప్పటి వరకు రజనీకాంత్‌కు మాత్రమే వాడుతున్నారు. కానీ, మక్కల్‌ పదాన్ని చేర్చి లారెన్స్‌ని కూడా సూపర్‌స్టార్‌గా సంబోధించడంపై మిశ్రమ స్పందన వస్తోంది. డైరెక్ట్ గా మక్కల్ స్టార్ అనిఉంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదు.., కానీ రజినీ బిరుదుని తలపించేలా ఉండటం తో పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి.

నేనూ షాక్‌కి గురయ్యాను

నేనూ షాక్‌కి గురయ్యాను

దీనిపై లారెన్స్ స్పందిస్తూ... ‘సినిమాలో నా పేరు ముందు ‘మక్కల్‌ సూపర్‌స్టార్‌' అని ఉండడం చూసి నేనూ షాక్‌కి గురయ్యాను. ప్రధానంగా సూపర్‌స్టార్‌ అంటే మన తలైవర్‌ రజనీకాంత్ సార్‌ ఒక్కరే. ఆయనకు నేను వీరాభిమానిని. నన్ను సినీ పరిశ్రమకి పరిచయం చేసింది ఆయనే.

రాఘవేంద్రస్వామి కనిపించారు

రాఘవేంద్రస్వామి కనిపించారు

నాకు ఆయనలో రాఘవేంద్రస్వామి కనిపించారు. ఎప్పటికీ రజనీసార్‌కి అభిమానిగానే ఉంటాను. ఇకపోతే నా పేరుకి ఒక బిరుదు ఇవ్వాలి అనుకుంటే నాకు నా తల్లి పేరు కంటే గొప్ప బిరుదు ఇంకేమీ లేదు లేదు. కన్మణి రాఘవ లారెన్స్‌గా పిలిస్తే మరింత ఆనందిస్తా' అని ఉద్వేగంగా చెప్పాడు. తాను సూపర్ స్టార్ని కాదంటూనే సూపర్ ఆన్సర్ ఇచ్చాడు లారెన్స్..

English summary
Acor Raghava Lawrence posted a clarification on Twitter clearing his stand on the title ‘Makkal Superstar’ which featured in the credits of his latest release, Motta Siva Ketta Siva. He said the title belongs to Rajinikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu