»   » ఆలీకి వచ్చిన డిసీజ్: ఇప్పుడు రాజ్ తరుణ్‌కి కూడా

ఆలీకి వచ్చిన డిసీజ్: ఇప్పుడు రాజ్ తరుణ్‌కి కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Raj Tarun Can Not Resist Stealing Things In His Upcoming Movie "RAJUGADU"

కిస్కా మిస్కా ఈ జబ్బు పేరు గుర్తుందా..?? గతం లో నటుడు ఆలికి ఒక సినిమాలో ఇదే జబ్బు ఉంటుంది. తనకు తెలియకుండానే సాయంత్రం అయ్యిందంటే చాలు తనకు తెలియకుండానే వింతపనులన్నీ చేస్తూంటాడు. జేబులు కొట్టటం, చిన్న చ్నిన్న దొంగతనాలు చేయటం లాంటివన్న మాట. అదే జబ్బు తర్వాత బ్రహ్మానందానికీ అంటుకుని తన పై ఆఫీసర్ ఇంట్లోని హుండీలో డబ్బులు కొట్టెయ్యబోయి దొరికిపోతాడు. "చెంబులో చెయ్యెందుకుపెట్టావ్" అన్న డైలాగ్ గుర్తుందికదా. అయితే ఈ జబ్బు కామెడీకోసం పెట్టిందే అయినా నిజానికి అలాండి డిజార్డర్ కూడా ఒకటి ఉంది. ఒక దొంగతనం చేయటం ద్వారా తెలియని సంతృప్తికి లోనయ్యే లక్షణాలున్న ఈ వ్యాదితో భాదపడే వ్యక్తిగా ఇప్పుడు రాజ్ తరుణ్ కనిపించనున్నాడట.

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. సంజనా రెడ్డి అనే కొత్త దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో ఓ వింత జబ్బుతో బాధపడుతుంటాడట. ఇటీవల భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు ఇదే తరహా కథా కథనాలతో తెరకెక్కి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే బాటలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

రాజు గాడు

రాజు గాడు

‘రాజు గాడు' సినిమాలో రాజ్ తరుణ్ కు ఒక వింత జబ్బు ఉంటుందట. తన ప్రమేయం లేకుండా దొంగతనం చేయడమే ఆ జబ్బు. దొంగతనాలు ఆపుకోలేని బలహీనత అతడికి ఉంటుందట. దీని నేపథ్యంలో సినిమాను సరదాగా నడిపించారని సమాచారం. ‘మహానుభావుడు' సినిమాలో శర్వాకు అతి శుభ్రతకు సంబంధించి ఓసీడీ అనే డిజార్డర్ ఉందన్న సంగతి తెలిసిందే.

తొలిసారి కాదు

తొలిసారి కాదు

మరి ఇలాగే ‘డిజార్డర్'ను నమ్మకుని వస్తున్న రాజ్ తరుణ్.. ఈ కాన్సెప్ట్ ద్వారా ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. ఓ వ్యక్తి తన ప్రమేయం లేకుండా దొంగతనాలు చేసే లక్షణం సినిమాల్లో చూపించడం ఇది తొలిసారి కాదు. హాలీవుడ్లో కొన్ని సినిమాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చాయి.

 అనిల్ సుంకర నిర్మాణంలో

అనిల్ సుంకర నిర్మాణంలో

తెలుగులోకి డబ్ అయిన తమిళ సినిమా ‘మేము'లో ఒక పాత్ర ఈ లక్షణాలతోనే సాగుతుంది. ఆ పాత్రతో కామెడీ బాగానే పండించారు. మరి కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి ‘రాజు గాడు'లో హీరో పాత్రతో ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన ముంబయి భామ అమైరా దస్తూర్ నటిస్తోంది.

English summary
Raj Tarun is occupied with the shooting for Rajugadu. The film is being shot in Hyderabad itself. Apparently, Tarun will be seen in the role of a guy who cannot resist stealing things.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu