»   » హీరోయిన్స్ విషయంలో రాజమౌళిది యూజ్ అండ్ త్రో క్యారెక్టరా...

హీరోయిన్స్ విషయంలో రాజమౌళిది యూజ్ అండ్ త్రో క్యారెక్టరా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడిగా రాజమౌళి తెలుగు సినిమానే కొత్త శకంవైపు నడిపించాడు. యంగ్ హీరోలకు ఇమేజ్ బాంధవుడయ్యాడు. మరి అదే హీరోయిన్లకు అయితే? స్టూడెంట్ నెం.1 మొదలుకొని ఈగ వరకు రాజమౌళి హీరోయిన్లు పట్ల యూజ్ అండ్ త్రో పాలసీనే అనుసరించాడు. ఒక్కసారి టచ్ చేసిన హీరోయిన్ ని రెండోసారి ముట్టుకోలేదు. గజాల, భూమిక, అంకిత, జెనీలియా, శ్రియ, అనుష్క, ప్రియమణి, మమతా మోహన్ దాస్, కాజల్, సలోని ఇప్పడు సమంతా ఇలా అందరూ రాజమౌళితో ఒక్క సినిమా తప్ప లాంగ్ టర్మ్ రిలేషన్ కంటిన్యూ చేయలేకపోయారు.

ఒక్కో హీరోతో రెండేసి, మూడేసి సినిమాలు చేస్తున్న రాజమౌళి హీరోయిన్ల విషయంలో ఎప్పుడు ఫ్రెష్ అయితేనే రిఫ్రెష్ అవుతాడేమో? కానీ ఈ మద్యలొ ఈ రాజావారికి సలోనిలో ఏం నచ్చిందో కానీ తన పంధాకు భిన్నంగా చిన్న వెసులుబాటు ఇచ్చాడు. అదే 'మగధీర" లో చిన్న సీన్, 'మర్యాద రామన్న"లో పెద్ద సీన్ తేడా అంతే..తర్వాత అంతే సంగతులు, ఇదండీ రాజమౌళి యూజ్ అండ్ త్రో క్యారెక్టర్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu