»   » వారిరువురికి అవార్డులు రాకపోవడం బాధించింది: రాజమౌళి

వారిరువురికి అవార్డులు రాకపోవడం బాధించింది: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెక్నికల్ గా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన సినిమాగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నబ్లాక్ బస్టర్ 'మగధీర" చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం అయినప్పటికీ ఆ సినిమాకు ఇంకా అవార్డులు ఎక్స్ పెక్ట్ చేసానని, రెండు మాత్రమే రావడంతో డిస్అపాయింట్ మెంట్ అయ్యానని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఐబిన్ లైవ్ చానల్ టెలిపోన్ లో సమాదానం ఇచ్చాడు. అంతే కాకుండా దీని పై మరేవిధంగా స్పందిచలేనని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. అంతే కాకుండా ట్విట్టర్ ద్వారా అవార్డ్ విన్నర్స్ ను తెలియజేసిన ఆయన అభిమానులకు తను స్పెషల్ థాక్స్ తెలియజేశారు.

స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన'కమల్ కణ్ణన్"కు, కొరియోగ్రాఫర్ గా శివశంకర్ మాస్టర్ కు ఈ అవార్డులు రావడం హ్యాపీగానే వున్నప్పటికీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కు, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కు రాకపోవడం కొంత బాధ కలిగించింది" అన్నాడు రాజమౌళి. 140కోట్ల రూపాయల భారీ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో 'రోబో" చిత్రాన్ని రూపొందిస్తున్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా ఇప్పటి వరకు సౌత్ లో రూపొందిన సినిమాలన్నింటిలో 'మగధీర" విజువల్ గా, గ్రాఫిక్స్ పరంగా చాలా గొప్ప సినిమా అని ప్రశంసించడం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu