»   » 'ఈగ'.. నీకు ధన్యవాదాలు!: రాజమౌళి

'ఈగ'.. నీకు ధన్యవాదాలు!: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నెలరోజుల విహారయాత్ర తర్వాత రాజమౌళి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన యాత్ర అనుభవాలను ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాజమౌళి.


''బుసాన్‌లో 'బాహుబలి' ప్రదర్శన తర్వాత నన్ను అక్కడివారికి 'ఈగ' దర్శకుడు అని పరిచయం చేశారు. 'ఈగ'ను 2012 బుసాన్‌లో ప్రదర్శించిన విషయాన్నీ ప్రస్తావించారు. ఆ మాట విన్న వెంటనే అక్కడి ప్రేక్షకుల్లో ఆశ్చర్యం చూశాను. కార్యక్రమం పూర్త్తెన తర్వాత చాలామంది మా 'ఈగ' డీవీడీ మీద ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. నా కెరీర్‌కు ఆ సినిమా ఎంతో ఉపయోగపడింది. 'ఈగ'కు ధన్యవాదాలు'' అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.దక్షిణ కొరియాలోని బుసాన్‌ సినిమా సెంటర్ లో ప్రపంచ ప్రఖ్యాత బుసాన్‌ చలన చిత్రోత్సవం జరుగుతోంది... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాలను అక్కడ ప్రదర్శిస్తుంటారు. ఆ సెంటర్‌లో ఓవైపు సినిమాల ప్రదర్శన జరుగుతోంది. మరోవైపు చూస్తే అక్కడి యువత పెద్ద క్యూ కట్టేసింది. ఏ టికెట్ల కోసమో, పాస్‌ల కోసమో కాదు.


Rajamouli thanks to Eega Movie

ఓ వ్యక్తి ఆటోగ్రాఫ్‌ కోసం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన దర్శక 'బాహుబలి' రాజమౌళి. బుసాన్‌ చిత్రోత్సవంలో 'బాహుబలి: ది బిగినింగ్‌'ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి యువతకు రాజమౌళి ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న ఫొటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.ఈ సందర్భంగా రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి: ది బిగినింగ్‌' విజయం వెనుక విజువల్‌ ఎఫెక్ట్స్‌, యుద్ధం నేపథ్యంలోని సన్నివేశాలది ప్రముఖ స్థానం. 'బాహుబలి' రెండో భాగం నుంచి ప్రేక్షకులు ఎంతగా ఆశిస్తున్నారో మాకు అర్థమైంది. వాళ్లను నిరాశపరచకూడదని మా బృందం ఎంతో కష్టపడుతోంది. 'బాహుబలి: ది కంక్లూజన్‌' భారీగా ఉండబోతోంది. తొలి భాగాన్ని మించిపోయే భావోద్వేగాలతో రెండో భాగాన్ని తీర్చిదిద్దుతాం'' అన్నారు.


బుసాన్‌లో 'బాహుబలి: ది బిగినింగ్‌'ను ఈ నెల 4న ప్రదర్శించగా... 7న, 9న మరో రెండు ప్రదర్శనలు ఉన్నాయి.English summary
ssrajamouli tweeted:After the screening in Busan I mentioned I was the director of EEGA which screened there in 2012. There were so many oohs and aahs from the Audience. Many Koreans took my autograph on the dvd cover of EEGA...That film did so much to my career...thanks EEGA...:)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu