twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లూ బేవర్సే... ఇండస్ట్రీ గురించి ఏం తెలుసు? రాజేంద్ర ప్రసాద్ ఫైర్

    By Bojja Kumar
    |

    న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం 'బేవర్స్'. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ క్రియెష‌న్స్ ప‌తాకం‌పై పొన్నాల‌ చందు, ఎమ్ అర‌వింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం.

    వాళ్లు బేవర్సే...

    వాళ్లు బేవర్సే...

    ఈ సినిమా గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తల్లి దండ్రులను సరిగ్గా అర్థం చేసుకోలేని పిల్లలు అందరూ బేవర్సే... అనే కథ అనుకుంటుననారేమో? పిల్లలను సరిగా అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవర్సే అనే చక్కటి కాన్సెప్టుతో ఈ సినిమా చేస్తున్నారు అని తెలిపారు.

    అలాంటి నటుడిని ఇండస్ట్రీలో నేనొక్కడినే

    అలాంటి నటుడిని ఇండస్ట్రీలో నేనొక్కడినే

    మీ అందరికీ తెలుసు నేను కామెడీ హీరోగా ఉంటూనే కొన్ని ప్యార్లల్ సినిమాలు చేసినటువంటి నటుడిని. ఆ రోజుల్లో తీసుకుంటే ముత్యమంత ముగ్గు, పుణ్యస్త్రీ... ఈ మధ్య కాలంలో అయితే ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వరకు కూడా అలాంటి సినిమాలు చేశాను. తెలుగులో ఎక్కువ ప్యార్లల్ సినిమాలు చేసినటువంటి ఏకైక నటుడిని నేనే అయుండొచ్చు.... అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

    ఇప్పటి వరకు 10 నందులు తీసుకున్నా

    ఇప్పటి వరకు 10 నందులు తీసుకున్నా

    నేను ఎక్కువగా నంది అవార్డులు తీసుకోలేదు కానీ... ఇప్పటి వరకు తొమ్మిదో పదో తీసుకున్నాను. ఎర్రమందారం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ గా ‘మేడమ్' సినిమాకు నందులు తీసుకున్నాను.... అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

    అలా అంటే చాలా బాధేసింది

    అలా అంటే చాలా బాధేసింది

    ‘మొన్నా మధ్య ఎందుకొచ్చిందో తెలియదు కానీ... నంది అవార్డ్స్ సమయంలో ఒక టాపిక్ వచ్చింది. చాలా మంది మేధావులు మాట్లాడుతుంటే నేను టీవీలో చూస్తూ చేయి కట్టుకుని విన్నాను. నాకు అక్కడ ఓ డిషన్స్‌లో బాధేసింది. ఆ విషయం ఇప్పుడు ఇక్కడ చెప్పడమే సరైంది అనుకుంటున్నాను. కొంత మంది మేధావులు ప్యార్లల్ సినిమాల గురించి మాట్లాడారు. మలయాళంలో ప్యార్లల్ సినిమాలుంటాయి, మరాఠీలో ప్యార్లల్ సినిమాలుంటాయి... మోహన్ లాల్, మమ్ముటి ఇలాంటి వారు చేస్తారు.. మన దగ్గర లేవు, అలాంటివి చేయను అన్నారు. వారు అలా అనడంతో బాధేసింది' అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

    వాళ్లకు ఏం తెలుసు?

    వాళ్లకు ఏం తెలుసు?

    ప్యార్లల్ సినిమాల గురించి వారికి ఎంత తెలుసో నాకు తెలియదు కానీ....అలాంటి సినిమాలు ఇక్కడ కూడా ఉన్నాయి. వారి కళ్లకు కనిపించలేదేమో? ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకుంటే పక్కింటోడు మనల్ని గౌరవిస్తాడు. అందుకే నాకు బాధేసింది. తెలుగులో మహాఅద్భుతమైన సినిమాలు ఉన్నాయి. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, శోభన్ బాబుగారు, కృష్ణగారు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఇంకా అందరి పేర్లు చెప్పలేదని ఏమీ అనుకోవద్దు.... అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

    బేవర్స్ కూడా అలాంటిదే

    బేవర్స్ కూడా అలాంటిదే

    ఈ టాపిక్ ఎందుకు ఇక్కడ చెబుతున్నాను అంటే... ఆనలుగురు లాంటి ప్యార్లల్ సినిమాను మీ అందరూ మనసులో పెట్టుకున్నారు. అలా మనసులో పెట్టుకోగలిగే మరో సినిమా ఈ ‘బేవార్స్' అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. 100శాతం ప్రతి పాత్ర మీకు ఎదురు పడుతుంది. మీరు జీవితంలోని ఏదో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తుంది. మంచి కథలు, మంచి సినిమాలు ప్రతిసారీ రావు అన్నారు.

    అలా చేయడం కుదరదు

    అలా చేయడం కుదరదు

    ‘ఆ నలుగురు' సినిమా చేసిన తర్వాత అలాంటి సినిమాలు మళ్లీ చేయొచ్చుకదా అని చాలా మంది అడిగారు. లేడీస్ టైల్ నుండి నాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యేవి. అలా చేయడం కుదరదు కావాలంటే ఆ సినిమా సీడీ తెచ్చుకుని చూడు అని చెప్పేవాడిని. ఎందుకంటే ఒక సినిమా ఉన్నట్లే మరో సినిమా చేస్తే రోటీన్ అవుతుంది. విభిన్నంగా తీసినపుడు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి ఇస్తుంది.... అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

    English summary
    Rajendra Prasad comments On Nandi Awards Discussions at Bewars Movie Teaser Launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X