twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజేంద్రప్రసాద్ ‘ఓనమాలు’ రిలీజ్ డేట్ ఖరారు

    By Srikanya
    |

    డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ఓనమాలు'. కళ్యాణి మరో కీలక పాత్రలో చేసిన ఈ చిత్రం ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. అమ్మ, సొంతఊరు, చదువుకున్న బడి, ఆడుకున్న గుడి... ఇవి ఎప్పుడూ జ్ఞాపకాలు కావు. మనలోని భాగాలు. నిరంతరం మనల్ని ముందుకు నడిపించే మూలాలు. ఏదో ఒక సందర్భంలో నిస్పృహకు లోనైనపుడు మనలో చైతన్యాన్ని నింపే ఉత్ప్రేరకాలు. ఈ నిత్యసత్యాలకు తెర రూపాన్నిస్తూ రూపొందిన సినిమానే 'ఓనమాలు' అని చెప్తున్నారు.

    దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ... ''చూస్తున్నంతసేపూ సొంతఊరులో ఉన్న అనుభూతిని కలిగించే సినిమా ఇది. నేనెంతో మనసుపడి చేసిన సినిమా ఇది. కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు రాజేంద్రప్రసాద్. ఆయన కీర్తి కిరీటంలో ఓ కలికితురాయిలా నిలుస్తుంది ఈ పాత్ర. నటకిరీటి నటనాకౌశలం, తమ్ముడు సత్యం కథ, ఖదీర్‌బాబు మాటలు, సిరివెన్నెల సాహిత్యం ఈ సినిమాకు నాలుగు స్తంభాలు'' అన్నారు.

    'ఓనమాలు' మంచి జ్ఞాపకం లాంటి సినిమా. మనిషికి జ్ఞాపకం ఒక అదృష్టం. ఓనమాలు తెలియని వ్యక్తంటూ వుండరు. ఫిల్మ్ స్కూల్లో ఓనమాలు నేర్చుకుని నటుడ్నయ్యాను. నందమూరి తారక రామారావు దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి తమ జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది. ఈ చిత్రం చూశాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పుట్టిన ఊరికి, కన్నతల్లి చెంతకు వెళ్లాలనుకుంటాడు' అంతలా కదిలించే చిత్రమిది అన్నారు డా॥ డా.రాజేంద్రప్రసాద్.

    అలాగే విడుదలకు ముందే అటు ప్రేక్షకుల్లో, ఇటు పరిశ్రమలో సినిమాపై పాజిటీవ్ వైబ్రేషన్స్ కలగడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారి 'ఆ నలుగురు' చిత్రం స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. ఈ నెల 27న సినిమాను విడుదల చేస్తున్నాం'' అని క్రాంతిమాధవ్ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కె.దుర్గాదేవి, నిర్మాణం: సన్‌షైన్ సినిమా.

    English summary
    Dr Rajendra Prasad is coming up with yet another message oriented film ‘Onamalu’ which is produced and directed by Kranti Madhav. The film is ready for release on July 27th. With the tagline ‘Atchamaina Telugu Katha’, the story of the film revolves around the school teacher named Narayana Rao. Khadeer Babu’s dialogues are said to be thought provoking and Sirivennela Seetarama Sastry's lyrics are no exception. Hari Anumolu handled the camera.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X