»   »  పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారించామన్న సీనియర్ స్టార్

పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారించామన్న సీనియర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మధ్య ఏర్పడ్డ డబ్బు వివాదాన్ని పరిష్కరించినట్లు రాజేంద్రప్రసాద్ స్పష్టం చేసారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు.

అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించి పవన్ కల్యాణ్ కు బకాయిపడ్డ మొత్తాన్ని ఇవ్వాలని ఆ చిత్ర నిర్మాతకు చెప్పామని, సమస్య పరిష్కారం అయిందని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్ నుండి తమకు అందిన ఫిర్యాదును ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు పంపి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేసామని తెలిపారు. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Rajendra Prasad visits Tirupati

మరో వైపు నిర్మాతకు పవన్ కళ్యాన్ రూ. 50 లక్షలు డిస్కౌంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘నాన్నకు ప్రేమతో' చిత్రానికి కలెక్షన్లు బాగానే ఉన్నా... లాభాలు ఆశించిన రేంజిలో లేవు. ఇప్పటికైతే తన చేతికి వచ్చిన డబ్బుతో బివిఎస్ఎన్ ప్రసాద్ వెంటనే పవన్ కళ్యాణ్ ను సంప్రదించి బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడానికి వచ్చాడని.... నిర్మాత కోరిక మేరకు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు డిసౌట్ ఇచ్చాడని, రూ. 1.50 కోట్లు మాత్రమే స్వీకరించారని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కూడా నిర్మాతకు కొంత డిసౌంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Rajendra Prasad visits Tirupati this morning, confirmed that Pawan, BVSN issue has been solved amicably.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu