»   » హైదరాబాద్ రైల్లో రజనీకాంత్

హైదరాబాద్ రైల్లో రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రజనీకాంత్‌ కొత్త చిత్రం 'లింగా'షూటింగ్‌ త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనుంది. ఇందులో రజనీకాంత్‌ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ . జగపతిబాబు కీలక పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది.

మైసూర్‌లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరపనున్నారు. ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా రూపొందించిన రైలు సెట్‌లో సన్నివేశాలను చిత్రిస్తారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

Rajini’s Linga first schedule of shooting over

నిర్మాతలు మాట్లాడుతూ... ''రెండు తరాల వారధిగా సినిమా ఉండబోతోంది. రజనీకాంత్‌ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ తరహా చిత్రమిది. కె.ఎస్‌.రవికుమార్‌ చక్కటి కథతో ప్రేక్షకులను విస్మయపరచబోతున్నారు. రజనీ వైవిధ్య శైలి, కె.ఎస్‌.రవికుమార్‌ పాళి కలిసి సినిమా కొత్తగా ఉండబోతోంది'' అంటున్నారు.

మరోప్రక్క దక్షిణాదిలో తొలి చిత్రంతోనే బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'లింగా'లోని నటనకుగాను రజనీ సహా చిత్రబృందమంతా పొగడ్తలతో ఆమెను ముంచెత్తిందట. ''దక్షిణాదికి కొత్త అయినప్పటికీ సోనాక్షి మెరుగైన నటనను ప్రదర్శిస్తోంది. తొలి టేక్‌లోనే సన్నివేశాలను పూర్తి చేసుకుంటోంది'' అంటూ యూనిట్ సోనాక్షిని పొగిడేస్తోంది.

Read more about: linga rajini sonakshi
English summary
1st Shedule of linga movie shooting has been completed. This shedule includes the scenes of Rajini and Sonakshi and their one duet song. The other parts of Sonakshi’s scenes will be shooted in hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu