»   » 100 అడుగుల హాట్ బెలూన్‌తో రోబో 2.0 ప్రమోషన్.. ప్రపంచయాత్ర.. రజనీ, అక్షయ్..

100 అడుగుల హాట్ బెలూన్‌తో రోబో 2.0 ప్రమోషన్.. ప్రపంచయాత్ర.. రజనీ, అక్షయ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిత్ర పరిశ్రమలో సినిమాలు రూపొందించడం ఓ లెక్క.. వాటిని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం మరో లెక్క. తాము తీసిన సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడానికి రకరకాల ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతారు. రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రం ప్రమోషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా రోబో సినిమా ప్రమోషన్ చేయాలని నిర్ణయించారు.

హాట్ బెలూన్‌తో ప్రచారం..

హాట్ బెలూన్‌తో ప్రచారం..

ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో సినిమా వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకు సిద్ధమవుతున్నది. 3డీ ఫార్మాట్‌లో రూపొందిన ఈ సినిమా కోసం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేశారనే ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ప్రమోషన్ కోసం భారీ హాట్ బెలూన్ ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ బెలూన్ ప్రపంచం మొత్తం తిరిగి వస్తుందట. రజనీకాంత్, అక్షయ్ కుమార్ చిత్రాలు ఉన్న ఈ బెలూన్ పలు దేశాల్లో ప్రయాణిస్తుంది.

100 అడుగుల ఎత్తైన బెలూన్‌తో..

100 అడుగుల ఎత్తైన బెలూన్‌తో..

ఈ హాట్ బెలూన్ ఎత్తు 100 అడుగులు. ఈ బెలూన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో బెలూన్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తాం. రోబో 2.0 చిత్రాన్ని హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాం. కావున ఈ బెలూన్‌ను లాస్ ఎంజెలెస్‌లోని హాలీవుడ్‌‌లో కూడా ప్రదర్శిస్తాం. అని లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం పేర్కొన్నారు.

పలు దేశాల మీదుగా ప్రయాణం..

పలు దేశాల మీదుగా ప్రయాణం..

ఈ బెలూన్ లండన్, దుబాయ్ ఆస్ట్రేలియా దేశాలతో మరికొన్ని దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ బెలూన్ ద్వారా బ్రహ్మండమైన ప్రచారాన్ని నిర్వహించాలని అనుకొంటున్నాం. అంతేకాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా దానితో ప్రచారం నిర్వహించాలనుకొంటున్నాం. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్‌తోపాటు మిగితా నటులు పాల్గొంటారు అని మహాలింగం తెలిపారు.

రోబో 2.0 కోసం బాహుబలి టీమ్

రోబో 2.0 కోసం బాహుబలి టీమ్

2010లో విడుదలైన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రోబో 2.0 తెరకెక్కుతున్నది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్న రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రానికి బాహుబలి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, గ్రాఫిక్ టీం పనిచేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అక్షయ్ కుమార్ దక్షిణాది సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విలన్‌గా అక్షయ్ కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా కనిపించనున్నది.

English summary
Lyca Productions, the makers of superstar Rajinikanth's upcoming Tamil science-fiction action drama 2.0, are pushing the envelope as they begin the promotional campaign for the film. Lyca Productions, creative head, Raju Mahalingam told media that "We plan to take the 100-foot-tall hot-air balloon to as many balloon festivals as possible across the world. Since we see our film as a Hollywood production, we also plan to tie up the balloon over the Hollywood signage in Los Angeles,"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu