»   » ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు!

ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్‍‌... సౌత్‌లో ఆయన్ను మించిన స్టార్ ఇప్పటి వరకు రాలేదంటే అతిశయోక్తి కాదేమో. సౌత్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆయన. ఇక తమిళనాడులో అయితే ఆయన్ను దేవుడిలా కొలుస్తారు చాలా మంది అభిమానులు.

  సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనం. రెండు మూడు హిట్లు వస్తే చాలు కళ్లు నెత్తికెక్కినట్లు ప్రవర్తించే స్టార్ ఎందరో. కానీ అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఎలాంటి ఆడంభరాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేస్తుంటారు రజనీ. అంతే కాదు ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా అభిమానులు, ప్రజల్లో ఆయన పట్ల గౌరవం పెరిగేలా చేసాయి.

  అయితే రజనీకాంత్‌కు సూపర్ స్టార్ హోదా అంత ఈజీగా ఏమీ రాలేదు. సినిమా రంగంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత పెద్ద స్టార్ అయ్యారు. బాక్సాఫీసును స్థాయికి ఎదిగారు.

  మరి అలాంటి రజనీకాంత్ జీవితాన్ని సినిమాగా తీస్తే? ఆయన గురించి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని రహస్యాలు సినిమా ద్వారా బయట పెడితే? ఆ సినిమాకు ఎంత క్రేజ్ వస్తుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. త్వరలోనే రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ బాధ్యతను తీసుకునేది మరెవరో కాదు.. స్వయంగా ఆయన ఇద్దరు కూతుళ్లే.

  స్లైడ్ షోలో మరిన్ని వివరాలు....

  ఐశ్వర్య, సౌందర్య కలిసి..

  ఐశ్వర్య, సౌందర్య కలిసి..

  రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు కలిసి తన తండ్రి జీవితాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

  అఫీషియల్ ప్రకటన

  అఫీషియల్ ప్రకటన

  ఈ విషయమై సౌందర్య స్పందిస్తూ..‘నిజమే.. నాన్నగారి జీవితం మీద సినిమా తీయాలనుకుంటున్నాం. నా సోదరి ఐశ్వర్య నాన్నగారి జీవితం మీద బుక్ రాస్తోంది. నాన్నగారి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి' అన్నారు.

  రహస్యాలు..

  రహస్యాలు..

  రజనీకాంత్ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రంపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఈ సినిమాలో అభిమానులు చూడబోతున్నారు.

  ఎవరికీ తెలియదు..

  ఎవరికీ తెలియదు..

  నాన్నగారి జీవితంలోని కొన్ని సంఘటనలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. సినిమాలో మేము వాటిని చూపించబోతున్నాం. నేను ఆయన కూతుర్ని మాత్రమే కాదు..ఆయనకు పెద్ద అభిమానిని కూడా, ఆయన సినిమా తెరపై చూడటం అంటే నాకు చాలా ఇష్టం. అభిమానులంతా ఆయన జీవితాన్ని సినిమాగా చూడటాన్ని ఇష్టపడతారు అని సౌందర్య తెలిపారు.

  చాలా కాలం నుండి

  చాలా కాలం నుండి

  నాన్నగారి జీవితం మీద బయోపిక్ తీయాలనే ఆలోచన చాలా కాలం నుండి ఉంది, ఆయన జీవితం ఎందరికో ఆదర్శం అని సౌందర్య తెలిపారు.

  బస్ కండక్టర్ నుండి అభిమానుల దేవుడిగా..

  బస్ కండక్టర్ నుండి అభిమానుల దేవుడిగా..

  సాధారణ బస్ కండక్టర్ నుండి అభిమానులు పూజించే దేవుడి స్థాయికి ఆయన ఎదగడానికి తోడ్పడిన అంశాలు ఈ సినిమాలో ముఖ్యంగా ఫోకస్ కానున్నాయి.

  వివాదాలు కూడా..

  వివాదాలు కూడా..

  రజనీకాంత్ స్టార్ గా ఎదిగిన తర్వాత కొన్ని వివాదాలు కూడా ఆయన్ను చుట్టు ముట్టాయి. అవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారు.

  కల్పితాలకు చోటులేకుండా..

  కల్పితాలకు చోటులేకుండా..

  సినిమాలో ఎలాంటి కల్పితాలకు చోటు లేకుండా పూర్తిగా ఆయన జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చూపెట్టబోతున్నారు.

  దర్శకత్వం ఎవరు?

  దర్శకత్వం ఎవరు?

  రజనీకాంత్ కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నారు.

  రజనీకాంతే నటిస్తారా?

  రజనీకాంతే నటిస్తారా?

  అయితే ఈ సినిమాలో రజనీకాంతే నటిస్తారా? లేక మరెవరైనా నటుడు ఈ చిత్రంలో రజనీకాంత్ గా నటించబోతున్నాడా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

  కష్టమే..

  కష్టమే..

  రజనీకాంత్ జీవితంపై సినిమా అంటే ఆయనలా మేనరిజం, స్టైల్ తెరపై ప్రదర్శించే నటుడు కావాలి. అలాంటి నటుడు దొరకడం కష్టం అంటున్నారంతా. రజనీకాంత్ తప్ప మరెవరూ నటించినా ఈ సినిమాకు పెద్దగా క్రేజ్ రాదని అంటున్నారు.

  కాస్ట్ అండ్ క్రూ

  కాస్ట్ అండ్ క్రూ

  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అపీషియల్ ప్రకటన రానుంది. త్వరలో ముఖ్య తారాగణం, టెక్నీషియన్స్ విషయాలు ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా సినీ పరిశ్రమకు సంబంధించి రజనీకాంత్ రియల్ టైమ్ ప్రెండ్స్ కూడా నటించబోతున్నారు.

  రిలీజ్ ఎప్పుడు?

  రిలీజ్ ఎప్పుడు?

  ఈ సినిమా ఈ సంవత్సరంలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

  రజనీకాంత్ ఫ్యామిలీ

  రజనీకాంత్ ఫ్యామిలీ

  తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి రజనీకాంత్.

  English summary
  As superstar Rajinikanth's fame reaches farther and wider with each of his release, making a biopic on him would be on the mind of many film-makers across the world. Apart from highlighting his popularity that is spread across the planet, the rags to riches story - which his life is all about would make for an interesting watch.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more