»   » విద్యాబాలన్ డర్టీ పిక్చర్ లో రజనీకాంత్..!

విద్యాబాలన్ డర్టీ పిక్చర్ లో రజనీకాంత్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్లబ్ డ్యాన్సర్ గా పలు చిత్రాలలో ఐటెం సాంగులు చేసి, సెక్సీ తారగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో 'డర్టీ పిక్చర్' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో సిల్క్ స్మితగా నటిస్తోంది. ఇప్పుడీ చిత్రంలో రజనీకాంత్ కూడా కనిపిస్తాడు! అంటే, రజనీని పోలిన పాత్ర ఉంటుందన్న మాట. దీనిని ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా పోషిస్తాడట. రకరకాల హెయిర్ స్టయిల్స్ తో, రజనీ అప్పట్లో ధరించినటువంటి చమ్కీ మెరుపుల దుస్తుల్లో నసీర్ కనిపిస్తాడు. విశేషమేమిటంటే, నసీర్ ఇంతవరకు రజనీ చిత్రాలు చూడలేదట. ఇప్పుడా సినిమాలు చూసే పనిలో పడ్డాడు. ఇందులో రజనీ పాత్రకీ, సిల్క్ స్మిత పాత్రకీ సంబంధం ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు.

English summary
Yes, you read it right! Veteran artist Naseeruddin Shah is indeed going to imitate the popular South Superstar Rajinikanth in the forthcoming Vidya Balan starrer ‘The Dirty Picture’, the biopic of Silk Smitha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu