»   »  రజినీ కాంత్ "దుర్యోధనుడి లాంటివాడా..!? మోహన్ బాబు ఎందుకలా అన్నాడు...

రజినీ కాంత్ "దుర్యోధనుడి లాంటివాడా..!? మోహన్ బాబు ఎందుకలా అన్నాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజినీ, డైలాగ్ కింగ్ మోహన్ బాబూ ఎంతటి మిత్రులో ప్రత్యేకంగా చెప్పే పని లేదు . ఈ ఇద్దరూ వేదికల మీదే ఏరా...అంటే ఏరా అనుకునేంత క్లోజ్ ఫ్రెండ్స్.అయితే మోహన్ బాబు వీలు చేసుకుని తన చిరకాల మిత్రుడు రజనీ ఇంటికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. శనివారం ఇద్దరూ కలిసి విలువైన సమయాన్ని గడిపారు. తన మిత్రుడు మహారాజులా కనిపిస్తున్నాడంటూ ట్వీట్ చేసి రజనీ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు మోహన్ బాబు.

Rajinikanth turns Duryodhana for Mohan Babu

అలాగే ఈ కలియుగంలో రజనీ దుర్యోధనుడైతే, తాను కర్ణుడినంటూ పేర్కొన్నారు.,,చాలాకాలం తర్వాత తన సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని తాను బలంగా నమ్ముతానంటూ ట్వీట్ చేశారు. వారితో కలిసి ఆత్మీయంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'నా బెస్ట్ ఫ్రెండ్ ను కలిశాను. కింగ్ లా ఉన్నాడు! ఈ కలియుగంలో అతను దుర్యోధనుడు, నేను కర్ణుడు'ని అంటూ ఆ ట్వీట్ లో తమ స్నేహబంధం గురించి గొప్పగా మోహన్ బాబు చెప్పుకున్నారు. ఇద్దరూ మహా భారతంక్ లోని విలన్ పాత్రలే అయినప్పటికీ. ప్రాణ మిత్రులుగా ఇద్దరూ చాలా పాపులర్ కదా. అందుకే ఆ పోలికన్న మాట.

Rajinikanth turns Duryodhana for Mohan Babu

అంతేకాకుండా, 'చాలా కాలం తర్వాత చెల్లెలు లతను కలిశాను. రజనీకాంత్ విజయం వెనుక ఆమె కూడా ఉందని నేను బలంగా నమ్ముతాను' అంటూ మరో ట్వీట్ లో మోహన్ బాబు పేర్కొన్నారు. రజనీ, మోహన్ బాబు ఆప్యాయంగా ఉన్న ఫొటోలతో పాటు, రజనీ భార్య లత, తనకు రాఖీ కడుతున్న మరో ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు

Rajinikanth turns Duryodhana for Mohan Babu
English summary
Actor Manchu Mohan Babu met his long-time friend and actor Rajinikanth at his residence in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu